Begin typing your search above and press return to search.
బాబుది ఐరన్ లెగ్ - ఇదే ప్రూఫ్!
By: Tupaki Desk | 21 Dec 2018 12:48 PM ISTవచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎలాగైనా ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చూస్తోంది కాంగ్రెస్. ఆ దిశగా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో త్యాగాలకూ సిద్ధమవుతోంది. గణనీయంగా సీట్లనూ వదులుకుంటోంది. అయితే - కాంగ్రెస్ ప్రయత్నాలకు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత కీలకమైన రెండు పార్టీలు కాంగ్రెస్ తో తెగదెంపులకు సిద్ధమయ్యాయి. ఆ రెండు పార్టీలు.. ఎస్పీ - బీఎస్పీ. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కొనేందుకుగాను ఎస్పీ - బీఎస్పీ ఇటీవలే దగ్గరయ్యాయి. కేంద్రంలో కాంగ్రెస్ తో ఈ రెండు పార్టీలు కలిసి నడుస్తాయని అంతా భావించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా పావులు కదుపుతుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ తో చర్చలు జరపకుండానే ఉత్తరప్రదేశ్ లో లోక్‌సభ సీట్ల పంపకాన్ని ఎస్పీ - బీఎస్పీ తాజాగా పూర్తి చేశాయి. వాటి లెక్కల ప్రకారం ఎస్పీ 37 స్థానాల్లో, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేస్తుంది. ఆర్ ఎల్డీ కి 3 సీట్లు కేటాయించారు. మరో రెండు స్థానాలు రాయ్ బరేలీ, అమేథీలను మాత్రం పంపకాల్లో పరిగణనలోకి తీసుకోలేదు. అవి రెండు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం. తమతో పొత్తు కావాలనుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఆ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాలని కాంగ్రెస్ కు ఎస్పీ - బీఎస్పీ స్పష్టం చేశాయి. దీంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడింది.
తాజా పరిణామానికి చంద్రబాబు ఐరన్ లెగ్గు మహిమే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. లేకపోతే ఇన్నాళ్లూ యూపీఏ తో సఖ్యత తో ఉన్న ఎస్పీ - బీఎస్పీ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్ ను దూరం కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి - యూపీఏ మొదటి నుంచి ఉంది. అధికారం నుంచి దిగిపోయాక కూడా యూపీఏ రాజ్యసభ లో పెత్తనం చెలాయించింది. వివిధ బిల్లుల విషయం లో మోదీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది.
చంద్రబాబు రాకతో కాంగ్రెస్ కూటమి లో పరిస్థితులు మారిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను తానే ఒక్కటి చేసినట్లు ఆయన చెప్పుకుంటుండటం కూటమికి ప్రతికూలాంశంగా మారినట్లు తెలుస్తోంది. నిన్నగాక మొన్న వచ్చిన బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం తొలి నుంచీ బీజేపీకి వ్యతరేకంగా ఏకతాటి పై పోరాడుతున్న కొన్ని పార్టీలకు రుచించడం లేదని సమాచారం. బాబు వైఖరి చూస్తుంటే కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పీఠాన్ని కూడా ఆయనే తీసుకునేలా అనిపిస్తోందని పలువురు విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే కూటమిలో తమ పట్టు నిలుపుకోవాలని - తమ ప్రాధాన్యతను చాటిచెప్పాలని కోరుకుంటున్నారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ కు ఎస్పీ - బీఎస్పీ ఇప్పుడు ఝలక్ ఇచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి బాబుది ఐరన్ లెగ్ అని ఈ పరిణామంతో ప్రూవ్ అయినట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.