Begin typing your search above and press return to search.

కరోనా వైరస్‌ కు విరుగుడు నా వద్ద ఉంది: చెన్నై డాక్టర్

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:20 AM GMT
కరోనా వైరస్‌ కు విరుగుడు నా వద్ద ఉంది: చెన్నై డాక్టర్
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలో వందమందికి పైగా మృతి చెందారు. చైనా నుంచి ప్రయాణంపై అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా కూడా ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ భారత్ కూడా వచ్చిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్‌ కు విరుగుడు కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి.

అయితే చెన్నైకి చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు తన వద్ద కరోనా వైరస్‌కు విరుగుడు ఔషదం ఉందని చెబుతున్నారు. దీనిని సేవిస్తే 24 గంటల నుంచి 48 గంటల మధ్య క్యూర్ అవుతుందని ధీమాగా చెబుతున్నారు. చెన్నైలోని రత్నసిద్ధ ఆసుపత్రిలో డాక్టర్ తనికసాలంవేణి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇతనికి సిద్ధ - ఆయుర్వేదిక్ వైద్యంలో 25 ఏళ్ల అనుభవం ఉంది.

కరోనా వైరస్ విషయం తెలియగానే వన మూలికల ద్వారా విరుగుడు ఔషధం తయారు చేసినట్లు చెప్పారు. సహచర వైద్యులు కూడా సహకరించారని చెప్పారు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ తో పాటు చైనా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ అనుమతిస్తే ఆయన తన టీంతో కలిసి చైనాకు వెళ్లేందుకు సిద్ధమని చెబుతున్నారు.

తాము వనమూలికల ద్వారా ఔషధం తయారు చేశామని, ఏ రకమైన వైరల్‌ కైనా ఇది పని చేస్తుందన్నారు. కరోనా వైరస్‌ కు మరో విరుగుడు లేదన్నారు. డెంగ్యూ - మల్టీ ఆర్గాన్ ఫీవర్ వంటి వివిధ రోగాలకు ఇది పని చేస్తుందని చెబుతున్నారు. చైనా - భారత్ అంగీకరిస్తే తాను మెడిసిన్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు.