Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై బాబు స‌ర్కారును కాగ్ క‌డిగేసింది!

By:  Tupaki Desk   |   11 May 2019 4:30 AM GMT
పోల‌వ‌రంపై బాబు స‌ర్కారును కాగ్ క‌డిగేసింది!
X
పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానాల్ని కాగ్ క‌డిగిపారేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీకి తెలీకుండా.. అనుమ‌తి లేకుండా కాంట్రాక్ట‌ర్ కు రూ.130.10 కోట్లు అద‌నంగా చెల్లించిన విష‌యాన్ని కాగ్ వెల్ల‌డించింది. పోల‌వ‌రం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేప‌ట్టిన నేప‌థ్యంలో 2017-18లో చేసిన ఖ‌ర్చును కాగ్ ప‌రిశీలించింది.

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో దొర్లిన త‌ప్పుల్ని కాగ్ ఎత్తి చూపింది. ఆ వివ‌రాలు చూస్తే..

+ ఒప్పందంలో లేని కూలీలు.. యంత్రాలు.. ఇత‌ర మెటీరియ‌ల్ కు పెరిగిన ధ‌ర‌ల‌ను చెల్లించ‌టానికి 2015 ఫిబ్ర‌వ‌రిలో
ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోతో రూ.130.10 కోట్లు చెల్లించారు. దీనిని పీపీఏ ద్వారా కేంద్రం అనుమ‌తి తీసుకోవాలి. కానీ.. అలాంటిదేమీ చేయ‌లేదు.

+ పీపీఏ ద్వారా కేంద్రం అనుమ‌తి తీసుకోవాల్సి ఉన్నా అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. కాంట్రాక్ట‌ర్లు.. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన‌వ‌న్నీ ఏపీ ప్ర‌భుత్వ‌మే చూప‌టం ఏమిటి?

+ ఇంత మొత్తాన్ని చెల్లించాల్సిన అవ‌స‌రం లేకున్నా చెల్లించ‌టం ఏమిటి?

+ కాంట్రాక్ట‌ర్ల‌కు ఇచ్చిన మొబిలైజేష‌న్ అడ్వాన్సుకు వ‌చ్చిన రూ.2.22 కోట్ల వ‌డ్డీని పీపీఏ అకౌంట్లో జ‌మ చేయ‌లేదు. భారీ మొత్తంలో నిధుల‌ను క‌రెంట్ అకౌంట్లో ఉంచ‌టం వ‌ల్ల రూ.2.7 కోట్ల న‌ష్టం వాటిల్లింది.

+ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,66,423.27 ఎక‌రాలు అవ‌స‌రం కాగా.. 1,10,823.52 ఎక‌రాలు సేక‌రించారు. ఈ భూముల‌ను కేంద్రం పేరుతో రిజిస్ట‌ర్ చేయాల్సి ఉంది. కానీ.. చేయ‌క‌పోవ‌టం ఏమిటి?