Begin typing your search above and press return to search.
టీడీపీ నేతల లూటీపై బుగ్గన ఏమన్నారంటే!
By: Tupaki Desk | 11 Sept 2017 10:48 AM ISTవైసీపీ యువ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా పదవిని దక్కించుకుని తనదైన శైలిలో సత్తా చాటుతున్న బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి... ఏం మాట్లాడినా దానిలో క్లారిటీ ఫుల్లుగానే ఉంటుందన్న వాదన ఉంది. విద్యాధికుడైన బుగ్గన కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో కాలుమోపిన ఆయనపై వైసీపీ అధినేతకు ఎంత గురి అంటే... పీఏసీ చైర్మన్ పదవి ఖాళీ అయిన మరుక్షణమే మరో ఆలోచన లేకుండా బుగ్గనకు ఆ పదవిని కట్టబెట్టారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలున్నా... వారందరికీ నచ్చజెప్పడంతో పాటు బుగ్గన సామర్ధ్యాన్ని వారికి వివరించి మరీ జగన్ బుగ్గనకు ఆ పదవిని ఇచ్చారట.
జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బుగ్గన ఏనాడూ వమ్ము చేయలేదనే చెప్పాలి. విపక్ష ఎమ్మెల్యేలుగా అధికార పక్షంపై ప్రతి చిన్న విషయంలోనూ దూకుడు ప్రదర్శించాల్సిందే. అయితే ఆ విషయానికి సంబంధించి సమగ్ర వివరాలను అరచేతిలో పెట్టుకుని మరీ బయటకు వస్తే.. బాగుంటుందన్నది జనం మాట. ఈ విషయాన్ని ఎంతమంది పక్కాగా అమలు చేస్తున్నారో తెలియదు గానీ... బుగ్గన మాత్రం పక్కాగా పాటిస్తున్నారనే చెప్పాలి. అధికారపక్షంపై తాను చేసే విమర్శలకు పక్కాగా ఆధారాలు చూపెడుతున్న బుగ్గన... తన విమర్శలకు ప్రతి విమర్శలు చెప్పేంత అవకాశం అధికార పక్షానికి ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా నిన్న తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా బుగ్గన చాలా అంశాలనే మాట్లాడారు. అధికార పక్షంపై మాటల తూటాలను పేల్చారు.
రాష్ట్రాన్ని టీడీపీ నేతలు లూటీ చేస్తున్నారని ఆయన కాస్తంత ఘాటుగానే ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో సదరు లూటీ ఎక్కడ జరుగుతోందన్న అంశాన్ని కూడా ప్రస్తావించిన ఆయన టీడీపీ నేతలకు నోట మాట రాకుండా చేశారనే చెప్పాలి. అయినా టీడీపీ నేతల లూటీ దందాపై బుగ్గన ఏమన్నారన్న విషయానికి వస్తే... హంద్రీనీవా కాల్వ వెడల్పు చేసే కాంట్రాక్టు పనులను మంత్రుల బంధువులకు అప్పగించి.. రూ.కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబు ఎన్నో హామీలను గుప్పించారని.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేసి... రాయలసీమపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.