Begin typing your search above and press return to search.
పాత టీడీపీ ఎమ్మెల్యేలంతా మళ్లీ చంద్రబాబు బాట?
By: Tupaki Desk | 30 Dec 2022 8:00 AM ISTతెలంగాణలో మరో తెలుగుదేశం పార్టీ ఏదయ్యా అంటే అది బీఆర్ఎస్ నే. ఎందుకంటే కేసీఆర్ నుంచి మొదలుపెడితే మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సహా చాలా మంది టీడీపీలో ఎదిగి అనంతరం జంప్ అయినవారే. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఖమ్మంలో చంద్రబాబు సభ పెట్టి సక్సెస్ కొట్టడంతో మెల్లిగా తెలుగుదేశం పార్టీ వైపు వాళ్లు మరలుతున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితులపై ఫైర్ అయ్యారు. సొంత పార్టీలో ప్రత్యర్థులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోయారు.
టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా.. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మరోలా ఇబ్బంది పెడుతున్నారని సండ్ర నిప్పులు చెరిగారు. తాను టీడీపీని వీడాలనుకోలేదని.. ఆ పార్టీని కాపాడడానికి సర్వశక్తులా ప్రయత్నించానన్నారు. ఆ పార్టీలో పెద్దలందరూ పార్టీ వీడిన తర్వాతే తాను కూడా వీడానన్నారు. టీడీపీ కోసం కేసులనూ ఎదుర్కొన్నానని వీరయ్య గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ లో ప్రస్తుత పరిస్థితులను ప్రజలు తెలుసుకుంటారని.. సత్తుపల్లి ప్రజలు విజ్ఞులంటూ ప్రజామోదం కూడా ట్రై చేస్తున్నారు.
తెలంగాణలో మళ్లీ చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఖమ్మంలో సభ నిర్వహించి పద్మవ్యూహాన్ని రచించారు. ఖమ్మం సభను నిర్వహించి ‘ఇదుగో తెలంగాణలో నా బలం” అని బిజెపికి మెసేజ్ పంపారు. తెలంగాణలో రెక్కలు తొడుక్కుంటున్న మీకు తన అవసరం ఉందంటూ మోదీకి చెప్పకనే చెప్పారు.. తెలంగాణలో బీజేపీ, టీడీపీతో జత కడితే ఏపీలో లైన్ క్లియర్ అయినట్టే అనేది టీడీపీ అధినేత భావన.. మరి ఆయన రాజకీయ చదరంగం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే..
టీడీపీ నుంచి గెలిచిన సండ్ర ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ లో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటితో ఇక్కడ ఆయన అసంతృప్తి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులో సత్తుపల్లి నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఆంధ్రా రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2014,2018 ఎన్నికల్లో సత్తుపల్లిలో టీఆర్ఎస్ నుంచి పిడమర్తి రవి పోటీచేసి ఓడిపోయారు. సండ్ర గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరిన సండ్ర అక్కడా అసమ్మతి రాజేస్తున్నారు. అందుకే టీడీపీకి దగ్గరవుతున్నారని తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.