Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోని మస్లిజ్ కి ఓటు వేయండి..!

By:  Tupaki Desk   |   14 Jan 2020 10:57 AM GMT
కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోని మస్లిజ్ కి ఓటు వేయండి..!
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారంలో కీలకనేతలందరూ తమ దూకుడిని ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో మస్లిజ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా డబ్బులున్నాయన్న ఓవైసీ... ఆ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు తమ పార్టీకి వేయాలంటూ ఓటర్లకు ఓవైసీ పిలుపుని ఇచ్చారు. కాంగ్రెస్ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఓవైసీ ఆ డబ్బులు తనవల్లే వస్తున్నాయి కాబట్టి అవి తీసుకుని తన పార్టీకి ఓటు వేయాలని కోరారు. అయితే తన విలువ రూ. 2వేలు కాదని అది ఇంకా ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు ఓవైసీ.

ఈ నెలలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 120 మున్సిపాలిటీలకు 10 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారాలతో బిజీగా గడుపుతున్నాయి. ఇదిలా ఉంటే భైంసాలో ఇప్పటికే కొందరు హిందూ సంఘాలకు చెందిన వారు మతకల్లోలాలకు తెరతీశారని ఆరోపించారు అసదుద్దీన్. మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలే లక్ష్యంగా ఆ హిందూ సంఘాల వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అసదుద్దీన్ అన్నారు. భైంసాలో కొద్దిరోజుల క్రితం మతఘర్షణలు చెలరేగాయి. వీటికి కారణం హిందూ సంఘాలే అని అసదుద్దీన్ ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ నేతలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. భైంసా ఘటనను ఆయన ఖండించారు. రాష్ట్రంలో మతకల్లోలాలు పెచ్చుమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణం పౌరతస్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ర్యాలీలు తీయడమే అని రాజాసింగ్ మండిపడ్డారు. ఈ ర్యాలీల పేరుతో హిందువులపై దాడులకు కొందరు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ ర్యాలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు కొందరు స్పాన్సర్ కూడా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.