Begin typing your search above and press return to search.

ఆజంఖాన్ తల నరికి పార్లమెంటు గుమ్మానికి వేలాడదీయాలట!

By:  Tupaki Desk   |   26 July 2019 10:33 AM IST
ఆజంఖాన్ తల నరికి పార్లమెంటు గుమ్మానికి వేలాడదీయాలట!
X
సమాజ్‌ వాది పార్టీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.. ఆయన వ్యాఖ్యలకు స్పందనగా బీజేపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ప్యానెల్ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి సమాజ్‌ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చ జరుగుతుండగా ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘‘మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉంద’’ని రమాదేవిని ఉద్దేశించి అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.

కాగా, ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్‌ పై బీజేపీకి చెందిన మైనారిటీ నేత ఆఫ్తాబ్ అద్వానీ మండిపడ్డారు. ఆజంఖాన్ తలను తెగనరకి పార్లమెంటు గుమ్మానికి వేలాడదీయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా మహిళలను అవమానిస్తే ఏం జరుగుతుందో ఆజంఖాన్ - అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారికి తెలిసొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అఫ్తాబ్... ఆజంఖాన్ తీరుపై మండిపడ్డారు. మహిళలను అవమానిపరిస్తే ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని ఆఫ్తాబ్ హెచ్చరించారు. ఆజంఖాన్ ఇంతకుముందు జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారని - ఇప్పుడు రమాదేవిని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆజంఖాన్‌ కు పిచ్చెక్కిందని తాను ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు. దేశానికి హానికరంగా తయారవుతున్న పిచ్చి కుక్క ఆజంఖాన్‌ ను చంపాల్సిందేనని ఆఫ్తాబ్ అన్నారు.