Begin typing your search above and press return to search.

బెట్టింగ్ ట్రెండ్ ఆధారంగా బీహార్ ఫలితాలఅంచనా

By:  Tupaki Desk   |   31 Oct 2015 6:06 PM GMT
బెట్టింగ్ ట్రెండ్ ఆధారంగా బీహార్ ఫలితాలఅంచనా
X
ఎలక్షన్ బెట్టింగ్ మొదలైపోయింది. వేల కోట్ల రూపాయల బెట్టింగ్ సామ్రాజ్యం నిద్రలేచింది. దేశవ్యాప్తంగా ఇపుడు బీహర్ ఎన్నికలపై వేల కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతుంది . ఎప్పటికప్పుడు అందుతున్న తాజా సమాచారంతో బెట్టింగులు ప్రీమియంలు మారిపోతున్నాయి . గడిచిన 15 రోజుల్లో బెట్టింగ్లు ర్యాంకింగులు పూర్తిగా తారుమారు కావడంతో ఇపుడు నిఘా వర్గాలతో పాటు రాజీకీయవేత్తలు కూడా బెట్టింగుల తాజా ట్రెండు ఆధారంగా తాము కూడా అంచనాలు వేసుకుంటున్నారట.

బెట్టింగ్ ప్రపంచంలో భారీ నెట్ వర్కు ఉంటుంది . ఫలితాలు దాదాపు వీరి అంచనాలకు దగ్గరగా ఉంటాయి . బెట్టింగ్ కింగ్ ల అంచనా లప్రకారం... వారి లెక్కల ప్రకారం.. ఎన్నికల్లో ప్రజలు నితీష్ కే పట్టం కట్టనున్నారు . ఎన్డీఏ కూటమికి 127 నుండి 129 స్దానాలు వస్తాయని అంచనా వేశారు . అధికారం దక్కాలంటే 122 స్దానాలు కావాలి . 15 రోజుల క్రితం బెట్టింగ్ ప్రపంచం అంచనాలో బీజేపి కూటమికి 150 స్దానాలు వస్తాయని , అందులో ఒక్క బీజేపి కే 108 స్దానాలు లెక్కవేశారు . నితీష్ కూటమికి వంద లోపు వస్తాయని అంచనా వేశారు . కాని మూడో విడత ఎన్నికల తరువాత పరిస్దితి పూర్తిగా మారిపోయింది . తాజా అంచనాల ప్రకారం ఎన్డీఏ కూటమికి వచ్చే స్దానాల సంఖ్య 110. ఇందులో బీజేపికి 94 స్దానాలు వస్తాయని భావిస్తున్నారు . మహాకూటమికి స్పష్టమైన మెజారిటి వస్తుందని బెట్టింగ్ రాయుళ్లు అంచనా వేస్తున్నారు. నవంవర్ 1 న జరిగే పోలింగ్ లో ఎన్డీఏకు కీలకమని బెట్టింగు వర్గాలు అంటున్నాయి.

అయిదో విడత పోలింగ్ మాత్రం పూర్తిగా మహకూటమి అనుకులంగా ఉండొచ్చు . ఎన్డీఏ ఆశలన్ని రేపు జరిగే పోలింగ్ పైనే ఉన్నాయి . తాజాగా బీజేపి జాతీయ నేతల దూకుడు కారణంగా పార్టీ దెబ్బతింటుందని స్థానిక నేతలు చెబుతున్నారు. దీంతో నాలుగు విడత పోలింగ్ పై కూడా మహాకూటమి ధీమగా ఉంది . మొత్తానికి పోటీ రసవత్తరంగా ఉందని నాలుగో విడత సోలింగ్ అత్యంత కీలకం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.