Begin typing your search above and press return to search.

మంత్రి హోదాలో ఉండి ఈ మాట‌లు క‌రెక్టేనా రోజా మేడం!

By:  Tupaki Desk   |   27 April 2022 11:30 AM GMT
మంత్రి హోదాలో ఉండి ఈ మాట‌లు క‌రెక్టేనా రోజా మేడం!
X
మంత్రి హోదాలో ఉన్న‌ప్పుడు.. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి క‌దా.. కానీ, అలాంటిదేమీ లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు... తాజాగా జ‌గ‌న్ కేబినెట్ 2.0లో చోటు ద‌క్కించుకున్న ఎమ్మెల్యే రోజా. తాజాగా చంద్ర‌బా బు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. మంత్రి హోదాలో ఉన్న రోజా.. ఇలా నోరు చేసుకోవ‌డం ఏంట‌నేది చ‌ర్చ‌గా మారింది.

ఇంత‌కీ.. రోజా ఏమ‌న్నాంటే..

టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పెద్ద ఉన్మాదని అన్నారు. టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామని అన్నారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ చీరలు కట్టుకోవాలన్నారు. చీర కావాలో.. చుడిదార్‌ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. టీడీపీ మహిళ ద్రోహి పార్టీ అని రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు.

టీడీపీలో ఉన్న ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరని మంత్రి రోజా అన్నారు. మహిళ కనిపిస్తే వాటేసుకోవా లి, ముద్దుపెట్టుకోవాలని.. చంద్రబాబు వియ్యంకుడు అనలేదా.. అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఆమె అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని దుయ్యబట్టారు. మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని అన్నారు. బాధితురాలికి పరామర్శ పేరుతో హడావుడి చేశారని, టీడీపీ ఎందుకు నిరసనలు చేస్తుందో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు.

మహిళా సాధికారత దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రోజా అన్నారు. సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదే అని తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నా రు. సీఎం జగన్‌ మహళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉ‍న్నారా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఇమేజ్‌ను దిగజార్చాలని టీడీపీ బూతు పురాణంతో మాట్లాడుతోందని మండిపడ్డారు.

దమ్మున్న నాయుకుడు సీఎం జగన్‌ అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. దిశా పోలీస్ స్టేషన్లను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. మహిళల సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ఎందుకు నిరసనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

అశోక్ జైన్ అనే టీడీపీ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడితే ఆ రోజు చంద్రబాబు ఎందుకు నిరసనలు చేయలేదు? అని ప్రశ్నించారు. లోకేష్ పీఏ పార్టీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రోజు ధర్నాలు ఎందుకు చేయలేదని రోజా నిలదీశారు. సీఎం జగన్‌, వైఎస్‌ భారతి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బూటు కాలితో మహిళలను కొడతాడని, వాళ్లు కాదా ఉన్మాదులని మండిపడ్డారు.