Begin typing your search above and press return to search.
నేనే మాల్యానా.? బాధేసిందన్న బండ్ల..
By: Tupaki Desk | 20 Dec 2018 10:31 AM ISTటీఆర్ ఎస్ ను ప్రజలు ఆశీర్వదించారని.. వాళ్లు నిజాయితీగా గెలిచారని.. సంక్షేమ పథకాలే వారి విజయానికి దోహదం చేశాయని.. దీన్ని తాను ఒప్పుకుంటున్నానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. షాద్ నగర్ లో ఓటేయడానికి వెళితే జనం తండోప తండాలుగా క్యూలు కట్టడం చూసి అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకున్నానని.. కానీ టీఆర్ ఎస్ ను గెలిపించేందుకు ఇలా జనం తరలివచ్చారని అనుకోలేదని బండ్ల చెప్పుకొచ్చాడు.. మహబూబ్ నగర్ లో వార్ వన్ సైడ్ అయిపోయిందని.. జనం టీఆర్ ఎస్ ను ఆమోదించారని.. మా పెద్ద పెద్ద కాంగ్రెస్ వాళ్లు ఓడిపోయారని బండ్ల అన్నారు. ఈ ఐదేళ్లు వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. దాని కోసం పోరాడుతామన్నారు. టీఆర్ఎస్ వాళ్లు మోసం చేసి గెలిచారనడాన్ని తాను ఒప్పుకోనన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని జనం కోరుకున్నారని.. తాను కూడా దాన్ని ఏకీభవిస్తానని చెప్పుకొచ్చారు.
తాజాగా బండ్ల గణేష్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమి భారంతో ఆయన బయట కనిపించలేదు. కాంగ్రెస్ ఓడిపోతే ‘గొంతు కోసుకుంటానని’ భీషణ ప్రతిజ్ఞ చేసి అభాసుపాలయ్యారు. మీడియా తనను టార్గెట్ చేయడంపై మనస్తాపంతో ఇప్పుడు తాజాగా ఓ చానెల్ కు వచ్చి తన బాధను వెల్లగక్కారు.
గెలిచిన టీఆర్ ఎస్ వాల్లు బాగున్నారని.. ఓడిన తాము కూడా బాగానే ఉన్నామని.. మధ్యలో ఈ మీడియా వాళ్లు మాత్రం అతి చేస్తున్నారని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ దొరికాడని.. తిరుపతిలో తాను కనపడితే కొన్ని చానెల్స్ వేశాయని.. తానేమీ విజయ్ మాల్యానా, లలిత్ మోడీ, నీరవ్ మోడీనా అని బండ్ల నిలదీశారు. నన్ను అడ్డంపెట్టుకొని, అభాసుపాలు చేసి కొందరు తప్పుడు ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకున్నారని.. కొత్త సంవత్సరానికి ఆ డబ్బులతో బట్టలు కొనుక్కోండి అని సెటైర్ వేశారు.
తెలంగాణలో ఓడిపోయినా తాము డీలా పడమని.. జ్వరం వచ్చిన కోడిలా తయారవుతామా.. బండ్ల తన మనస్తత్వాన్ని మార్చుకోరని.. అంతే దూకుడుగా ఉంటానని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ తో టీఆర్ ఎస్ గెలిచిందనడాన్ని బండ్ల తప్పుపట్టారు. అలా అయితే హిందీ మూడు రాష్ట్రాల్లో తాము అలాగే గెలిచామా అని నిలదీస్తారన్నారు. టీఆర్ ఎస్ విజయాన్ని ఒప్పుకోవాలన్నారు. తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవాన్నని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.