Begin typing your search above and press return to search.
సీఎం కుర్చీలో బాలయ్య...దర్జాగా సమీక్ష
By: Tupaki Desk | 24 Jan 2018 6:28 PM ISTఏపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది - హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ శైలి మరోసారి వివాదాస్పదం అయ్యింది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ రూమ్ ను అందుకు వేదిక చేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకర్గ అభివృద్ధికి సంబంధించి అధికారులతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష జరిపారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై మంత్రి దేవినేని సమక్షంలో సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ కార్యదర్శిముఖేష్ కుమార్ మీనా - ప్రత్యేక ప్రభుత్వకార్యదర్శి నీరబ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయానా వియ్యంకుడైనా సీఎం కుర్చీలో కూర్చుని అధికారులతో సమీక్ష నిర్వహించడంపై అధికారులు విస్తుబోయారు. అయితే ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేక అంతా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఫోటోలు బయటకు రావడంతో దుమారం రేగింది. కాగా, ఈ వివాదంపై అధికారికంగా ప్రభుత్వం నుంచి కానీ...ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఎలాంటి వివరణ విడుదల కాలేదు.