Begin typing your search above and press return to search.

యోగా గురువు దెబ్బకు ఒలింపిక్ విన్నర్ ఓటమి?

By:  Tupaki Desk   |   19 Jan 2017 4:13 AM GMT
యోగా గురువు దెబ్బకు ఒలింపిక్ విన్నర్ ఓటమి?
X
ఒకరు యోగా గురువు. మరొకరు రెజ్లింగ్ లో ఒలింపిక్స్ పోటీలో విన్నర్. మరి.. ఈ ఇద్దరూ రింగులో తలపడితే గెలుపు ఎవరిది? ఇది చాలా సింఫుల్ క్వశ్చన్.. ఇంకెవరు గెలుస్తారు ఒలింపిక్ పతకధారిదే విజయం అన్నదే మీ మాట అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఒలింపిక్ పతకథారికి ప్రత్యర్థిగా నిలించింది యోగా గురువు బాబా రాందేవ్ మరి. అయితే.. ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

నిత్యం యోగా చేస్తూ.. అప్పుడప్పడు వేదిక మీదన తన కండపుష్టిని ప్రదర్శించే బాబా రాందేవ్..తాజాగా తన అసలు సత్తా ఎంతన్నది అందరికి చూపించే ప్రయత్నం చేశారు. 2008 ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో రజతం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్ తో తలపడి చిత్తుగా ఓడించారు. అయితే.. అందుకు తగ్గట్లే ఒలింపిక్ పతకధారి సైతం తాను చేయగలిగినంత సాయం చేశారని చెప్పాలి.

కాకుంటే.. యోగా గురువును ఒక్క విషయం మాత్రం మెచ్చుకోవాలి. జాతీయ ఆటగాళ్లను ఓడించిన ఒక అంతర్జాతీయ ఆటగాడిని బాబా రాందేవ్ బౌట్ లో చలాకీగా తిరుగుతూ కాస్తంత తికమక పెట్టారని చెప్పక తప్పదు. ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే మాత్రం ప్రత్యర్థి స్టిడ్నిక్ తో జరిగిన బోట్ లో బాబా రాందేవ్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 12-0 తేడాతో విజయం సాధించటం.

వీరిద్దరి మ్యాచ్ ప్రారంభానికి ముందు బాబా రాందేశ్ సూర్య నమస్కారాలు చేసి.. ప్రత్యర్థిని ఆశీర్వదించి మరీ కుస్తీకి దిగారు. మ్యాట్ మీద బాబా రాందేవ్ చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిని తికమక పెట్టే ప్రయత్నం చేశారు. వరుస పాయింట్లు సాధించి..వ్యాపారంలోనే కాదు..వస్తాదులతో కుస్తీలోనూ తనకు తిరుగులేదన్నట్లుగా యోగా గురువు తన మేజిక్ ను ప్రదర్శించారు. కాకుంటే ప్రత్యర్థి కూడా తన సత్తా సాధించాలన్నట్లుగా ఆడి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండేదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/