Begin typing your search above and press return to search.

జగన్ ను పొగడొద్దు.. సెల్ ఫోన్లతో రావద్దు.. ఏపీ స్పీకర్ సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:02 PM IST
జగన్ ను పొగడొద్దు.. సెల్ ఫోన్లతో రావద్దు.. ఏపీ స్పీకర్ సంచలన ఆదేశాలు
X
మైక్, వీడియో కట్ చేసినా కూడా చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేశాడు. దాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేసి టీడీపీ మీడియాలో రచ్చ చేసింది. ఇక మాట్లాడితే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ ను పొగిడేస్తున్నారు. దీంతో ఇక ఏపీ స్పీకర్ కొరఢా ఝలిపించారు. రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. నిబంధనల మేరకు పనిచేయాలని సూచించారు.

తాజాగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను బట్టి స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక జగన్ ను పొగడొద్దు అని ఆదేశాలిచ్చారు. అంతేకాదు.. ఇక అసెంబ్లీలోకి ఎవరూ సెల్ ఫోన్లతో రావద్దని స్పష్టం చేశారు.

ప్రతిపక్షం టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఉన్న సమయంలో వైసీపీ మంత్రులు, సభ్యులు రెచ్చిపోయి వారిపై దూషణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అందుకే చంద్రబాబు సభను బాయ్ కాట్ చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు తిట్టడానికి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా పోయారు.

టీడీపీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడంతో గత నాలుగురోజులుగా సీఎం జగన్ నామస్మరణతో ఎమ్మెల్యేలు, మంత్రులు ఊగిపోతున్నారు. జగన్ పై నాలుగు ప్రశంసలు, పది పొగడ్తలు అన్న విధంగా సభ సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ ను పొగడడమే లక్ష్యంగా సభ సాగుతోంది. ఇంద్రుడు, చంద్రుడు, ఏపీని ఉద్దరించడానికి వచ్చిన యుగ పురుషుడు అంటూ ఎమ్మెల్యేలు తెగ ఊదరకొడుతున్నారు.

ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని కూడా జగన్ ను పొగిడేందుకే సభను పెట్టి తమ ధనాన్ని వృథా చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పీకర్ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ప్రసంగంలో జగన్పై పొగడ్తలపై చురకలంటించారు. ‘సభ మర్యాద కాపాడండి.. ప్రజల సమస్యలపై మాట్లాడండి.. సీఎం జగన్ పై పొగడ్తల కంటే మీరు చెప్పదలుచుకుంది చెప్పండి.. పొగడ్తలు వద్దు’ అని సభలోనే వాయించేశారు.

దీంతో మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం మౌనం దాల్చారు. రోజా సైతం డైరెక్ట్ విషయంలోకి వెళ్లింది. దీంతో స్పీకర్ చేసిన పనిపై నెటిజన్లు రాజకీయ వేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఇక చంద్రబాబు శపథాన్ని లైవ్ కట్ చేసినా సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ .. ఇక నుంచి ఏపీ అసెంబ్లీలో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.