Begin typing your search above and press return to search.

చంద్రబాబు నివాసం అక్రమం , ఖాళీ చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   18 Jun 2019 6:41 AM GMT
చంద్రబాబు నివాసం అక్రమం , ఖాళీ చేయాల్సిందే!
X
మరోసారి చర్చలోకి వచ్చింది చంద్రబాబు నాయుడి కరకట్ట నివాసం. ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధికారిక నివాసంగా వ్యవహరించిన బంగ్లా అక్రమ కట్టడం అని మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన అక్రమ కట్టడం అది అని వైఎస్ ఆర్సీపీ చెబుతూ వస్తోంది.

ఎన్నికల తర్వాత, అధికారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి అందాకా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అదే నివాసానికి అనుకున్నఉన్న భవనాన్ని తన అధికారిక నివాసంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. తనను కలవడానికి వచ్చే వారిని ఆ 'ప్రజావేదిక' లో కలవాలనుకుంటున్నట్టుగా.. దాన్ని తన అధికారిక కార్యాలయంగా గుర్తించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఘాటుగా స్పందిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక అక్రమ కట్టడాన్ని అధికారికంగా గుర్తించాలని కోరుతూ ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడి నివాసం అక్రమ కట్టడమే అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి నిర్ధారణ జరగగానే చంద్రబాబు నాయుడు ఆ కరకట్ట కట్టడాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని కూడా ఆళ్ల వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చేసిన తొలి విన్నపం తన ననివాసం విషయంలో.. ఆ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టం అవుతోంది.