Begin typing your search above and press return to search.

అలీ బ్యాక్ టూ పెవిలియన్?

By:  Tupaki Desk   |   1 Sep 2022 2:30 PM GMT
అలీ బ్యాక్ టూ పెవిలియన్?
X
ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఆ పార్టీ సానుభూతిపరుడిగానే ఆయన చాలా ఏళ్ళు కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల ముందు సడెన్ గా అలీ వైసీపీలో చేరారు. ఎందుకు అంటే అతనికి పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టూ భూములు ఉన్నాయి అని దాని వలన బీజేపీ నుంచి వచ్చిన రాజకీయ వత్తిళ్ళకు ఆయన అటూ ఇటూ చూసి చివరికి వైసీపీని ఎంచుకున్నారని ప్రచారంలో ఉంది. అలా అలీ వైసీపీలో చేరడానికి ఇష్టం లేకున్నా కూడా తప్పని పరిస్థితిల్లో చేరారని టాక్.

అయితే ఆ తరువాత చాలా సార్లు అలీ జగన్ని కలిసినా పెద్దగా అటు నుంచి రెస్పాన్స్ అయితే రాలేదని అంటున్నారు. దాంతో అలీ పూర్తిగా ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు. ఈ పరిణామంతో అలీ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి టీడీపీలో వెళ్తారు అని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఇక టీడీపీ బీజేపీ పొత్తు కుదురుతుందని అంటున్నారు. అలా బీజేపీ మొగ్గు ఎటూ టీడీపీకే అని తేలుతున్న వేళ అలీ కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి ప్రముఖ కెమెడియన్ గా ఉంటూ టీవీలలో యాంకర్ గా షోస్ చేస్తున్న అలీ మంత్రి కావాలని జీవితాశయం పెట్టుకున్నారు. కానీ ఆయనకు అది తీరడంలేదు. టీడీపీలో ఉన్నపుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా కుదరలేదు. ఇక వైసీపీలో కూడా హ్యాండ్ ఇచ్చేశారు అని అంటున్నారు. అలీకి పదవులు ఇస్తారని మీడియాలో ప్రచారం జరగడం తప్ప ఆయనకు దక్కింది ఏమీ లేదని అంటున్నారు.

దీంతో పాటు అలీ ఇపుడు తన పొలిటికల్ రూట్ కూడా మార్చుకుంటున్నారు అని తెలుస్తోంది. పైగా ఆయన ఉన్న సినీ ఇండస్ట్రీలో అయితే జనసేన, లేకపోతే టీడీపీ సానుభూతిపరులే ఎక్కువగా ఉన్నారు. 2019లో వైసీపీకి కొంత ఊపు సినీ వర్గాల నుంచి కనిపించినా అది పాలపొంగులా చల్లారిపోయింది. దాంతో పాటు సినీ పరిశ్రమ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లుగా ఒక దశలో సాగింది.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్యనే వెటనర్ హీరో మోహన్ బాబు జగన్ కి హ్యాండ్ ఇచ్చేసి చంద్రబాబుతో ఫోటో దిగి వచ్చారు. అంటే ఆయన కూడా టీడీపీ రూటే పడతారు అని అంటున్నారు. ఇక జయసుధ నాడు వైసీపీలో చేరినా ఇపుడు బీజేపీ లోకి వెళ్తారని అంటున్నారు.

నాడు జగన్ సమక్షంలో చేరిన జీవితా రాజశేఖర్ మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ కూడా జనసేనకు జై అంటున్నారు. ఇలా సినీ రంగంలో ఇపుడు వైసీపీకి మద్దతుగా పేరున్న వారు ఎవరూ లేరు. ఇపుడు అలీ కనుక జారిపోతే టాలీవుడ్ లో వైసీపీ ఫ్యాన్ అన్న వారే ఉండరని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.