Begin typing your search above and press return to search.

అఖిల‌కు న్యూఇయ‌ర్ షాక్ త‌గిలింద‌ట‌

By:  Tupaki Desk   |   1 Jan 2018 11:14 AM GMT
అఖిల‌కు న్యూఇయ‌ర్ షాక్ త‌గిలింద‌ట‌
X
మంత్రి ప‌ద‌వి ఉన్న నేతకు జిల్లాలో ఉండే హ‌వా ఎంతో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రంఉండ‌దు. దీనికి తోడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశీస్సులు.. చిన‌బాబు అండ ఉన్న నేత హ‌వా మామూలుగా ఉండ‌దు. కానీ.. అందుకు భిన్నంగా న్యూఇయ‌ర్ వేళ భారీ షాక్ త‌గిలింది. ఇంత‌కీ ఆ మంత్రి ఎవ‌రో కాదు.. క‌ర్నూలు జిల్లాలో వార‌స‌త్వంగా వ‌చ్చిన రాజ‌కీయ అండ‌తో అంత‌కంత‌కూ పెరుగుతున్న భూమా అఖిల‌ప్రియ‌కు దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది.

తన తండ్రికి ప్రాణ‌స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో మంత్రి అఖిల ప్రియ వైరం అంద‌రికి తెలిసిందే. డిసెంబ‌రు 31 సంద‌ర్భంగా అఖిల‌ప్రియ అడ్డా అయిన ఆళ్ల‌గ‌డ్డ‌లో భారీ విందు స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిల‌తో వ‌చ్చిన భేదాభిప్రాయాల నేప‌థ్యంలో.. మంత్రి అడ్డాలో పాగా వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. విందు రాజ‌కీయంతో అఖిల‌ను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఏవీ సుబ్బారెడ్డి విందు స‌క్సెస్ కాకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగిన అఖిల‌ప్రియ‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింద‌ని చెబుతున్నారు. త‌నకు సన్నిహితంగా ఉండేవారిని.. విధేయుల‌కు విందుకు వెళ్లొద్ద‌ని చెప్పినా.. దాదాపు 10వేల మంది విందుకు హాజ‌రు కావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే మంత్రి అఖిల‌ప్రియ‌కు బంధువులైన ఎస్వీ నాగిరెడ్డి.. ఎస్వీ ప్ర‌సాద‌రెడ్డిలు కూడా వెళ్ల‌టం పెద్ద దెబ్బ‌గా అభివ‌ర్ణ్ిస్తున్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌లోని ఏవీ ఫంక్ష‌న్ హాల్లో నిర్వ‌హించిన విందు భేటీకి వెళ్ల‌కుండా నియంత్రించేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేదంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఇస్తున్న విందుకు వెళ్లొద్దంటూ ఓపెన్ గా చెప్పిన‌ప్ప‌టికీ.. ప‌లువురు ఎంపీటీసీ.. జెడ్పీటీసీ.. కౌన్సిల‌ర్లు.. స‌ర్పంచ్ లు.. గ్రామాల నేత‌లు పెద్ద ఎత్తున విందుకు వెళ్లారు. ఇలా తాను న‌మ్ముకున్న వారంతా ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చిన విందుకు వెళ్ల‌టం మంత్రి అఖిల‌కు ఏ మాత్రం మింగుడు ప‌డ‌టం లేదంటున్నారు.

తాను చెప్పినా.. త‌న మాట విన‌కుండా విందుకు వెళ్లిన నేత‌ల లెక్క చూడాల‌ని మంత్రి అఖిల భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాను చెప్పినప్ప‌టికీ ప‌ట్టించుకోకుండా విందుకు వెళ్లిన నేత‌ల వివ‌రాల్ని సేక‌రించాల‌ని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు. విందుకు వెళ్లిన వారి విష‌యంలో ఇక‌పై క‌టువుగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆమె భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఏమైనా అధికార‌పక్షంలో బ‌ల‌మైన రెండు గ్రూపుల మ‌ధ్య న‌డుస్తున్న అధిప‌త్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.