Begin typing your search above and press return to search.
తమిళనాడులో బీజేపీ పాలన.. నమిత జోస్యం
By: Tupaki Desk | 17 Sept 2020 11:01 PM ISTతమిళనాడులో త్వరలో బీజేపీ అధికారం చేపడుతుందని ప్రముఖ హీరోయిన్ నమిత జోస్యం చెప్పింది. దివంగత సీఎం జయలలిత మరణానికి ముందు అన్నాడీఎంకేలో చేరిన నమిత ప్రస్తుతం తమిళనాడు బీజేపీలో హాట్ కామెంట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర కార్యాచరణ సభ్యురాలు పదవి దక్కించుకుంది.
తాజాగా ప్రధాని మోడీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర జాలర్ల సంఘం అధ్యక్షుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐస్ హౌస్ లో ప్రజలకు 370 కిలోల చేపలు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న నమిత విలేకరులతో మాట్లాడారు.
‘నీట్ పరీక్షకు భయపడి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరాదని.. అలాంటి వారు ఒక్కసారి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని కోరారు. మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ధ్యానం చేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారా? అన్న ప్రశ్నకు నమిత బదులిచ్చారు. ఆ విషయం ప్రస్తుతం అవసరం లేదని ఆమె తెలిపారు. దీన్ని బట్టి రాజకీయాల్లో పోటీకి నమత తటపటాయిస్తున్నట్టు తెలుస్తోంది.