Begin typing your search above and press return to search.

కృష్ణా జిల్లాలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   10 Feb 2023 9:51 PM IST
కృష్ణా జిల్లాలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!
X
ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మధ్య ఉప్పూనిప్పుగా పరిణామాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు పరిణామాలతో అప్రమత్తమైన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ వీరిద్దరికీ విడివిడిగా క్లాసు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీకు సంబంధం లేని నియోజకవర్గంలో నువ్వెందుకు వేలుపెడుతున్నావని జోగి రమేష్‌ పై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తన నియోజకవర్గంలో తనను సొంత పార్టీ వారే ఇబ్బందులు పెట్టడం నిజమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకోరాదని స్పష్టం చేశారని తెలిపారు. ఎట్టి రిస్థితుల్లో తాను పార్టీ వీడనని వెల్లడించారు. ఎప్పటికి వైఎస్‌ కుటుంబంతోనే తన ప్రయాణం అని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో ప్రతి కదలికను ఇక నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ పర్యవేక్షిస్తారని తెలిపారు. మితిమీరితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారని వెల్లడించారు.

ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పిలిచి మాట్లాడారు కనుక ఇకపై తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు.

తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారాలు చేస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను వైఎస్‌ఆర్‌ అభిమానినని.. ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై సీఎంతో జగన్‌ తో చర్చించామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా రూ,379 కోట్ల ఇరిగేషన్‌ పనులు ఇస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి దగ్గర రూ.20 కోట్లు అప్పుగా తీసుకున్నాడని ధ్వజమెత్తారు. అలాగే కొండపల్లికి చెందిన వ్యక్తి దగ్గర కూడా రూ.5 కోట్లు తీసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దేవినేని ఉమా డబ్బులు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమకు చంద్రబాబు టిక్కెట్‌ ఇస్తారని తాను అనుకోవడం లేదని వసంత కృష్ణప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వమే కోట్ల రుపాయలు వెచ్చించి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కృష్ణప్రసాద్‌ తెలిపారు. దేశంలో పెద్ద నాయకురాలు సోనియాతో విభేదాలు పెట్టుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నేత వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. లోకేష్‌ దొడ్డి దారిలో పదవులు అనుభవించి పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు వైఎస్, జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్రలో జనసముద్రం లాగా ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.