Begin typing your search above and press return to search.

వైసీపీ మహిళా ఓటు బ్యాంకుకు ఆ ప్రభావం పడనుందా?

By:  Tupaki Desk   |   31 May 2023 10:24 AM GMT
వైసీపీ మహిళా ఓటు బ్యాంకుకు ఆ ప్రభావం పడనుందా?
X
మహిళా ఓటు బ్యాంకు ని తన సొంతం చేసుకునేందుకు టిడిపి మహిళా మహాశక్తి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఇది అంత తేలిక‌ విషయం కాదు. 18 ఏళ్లు నిండినటువంటి అమ్మాయి నుంచి 60 ఏళ్లు 70 ఏళ్ళు వచ్చిన వృద్ధుల వరకు ఈ మహిళలకు సాయం చేసేందుకు టిడిపి పలు పథకాలను ప్రవేశపెట్టింది. దీనిలో అమ్మవ‌డిని కీలకంగా నాయకులు ప్రజలకు తీసుకెళ్లనున్నారు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నా 15000 రూపాయలు చొప్పున వాళ్లకి తల్లి వంద‌నం పథకం కింద ఉవ్వ‌నున్నారు.

ఇది సంచలనం చెప్పాలి. వైసీపీ గత ఎన్నికల్లో అందరికీ ఇస్తానని చెప్పి స్వయంగా సీఎం జగన్ భార్య భారతి రెడ్డి కడపలో ప్రచారం చేశారు. ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలోఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.

అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు అనే మాట వినిపిస్తోంది. కేవ‌లం ఒక్క‌రికే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. 15 వేలు ఇస్తామ‌ని చెప్పి 13000 కి మాత్రమే దీన్ని కుదించారు. ఇతరత్రా కారణాలు చెప్పి నాడు నేడు పథకానికి 1000 రూపాయలు కట్ చేసి మొత్తంగా 13000 కు మాత్రమే చేతిలో పెడుతున్నారు.

ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో టిడిపి అనూహ్యంగా 15000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఇస్తామని ప్రకటించడం ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టబోమ‌ని స్వయంగా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై ప్రకటించడం అనేది మహిళలను ఆకర్షిస్తున్న విషయం.

అదే విధంగా 18 ఏళ్లు నిండినటువంటి యువతులకు 1500 చొప్పున ప్రతినెలా ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం యువతులను ఆకర్షిస్తోంది. వృద్ధులకు నెలనెలా పింఛన్లు అదేవిధంగా ఆర్థిక సాయం బ్యాంకు నుంచి రుణాలు వంటివి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

దీంతో మహిళా ఓటు బ్యాంకు ఈసారి కీలకంగా మారింది. ఇప్పటివరకు వైసీపీ పెట్టుకున్నటువంటి అంచనాలు ప‌టాపంచ‌లు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని రాజకీయనాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి టీడీపీ వ్యూహాల‌కు వైసీపీ ప్ర‌తివ్యూహాలు ఏంటో చూడాలి.