చంద్రబాబు బాటలో కేసీఆర్ !

Sat May 14 2022 10:55:23 GMT+0530 (India Standard Time)

Update About KCR

బీజేపీ పార్టీ   పెద్ద అమిత్ షా రానున్న నేపథ్యం ఇది. తుక్కుగూడ హైద్రాబాద్  నగరి శివార్లలో సభకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. ఈ శనివారం  మే 13 2022న సభకు అంతా సిద్ధం కానుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన రాకను వ్యతిరేకిస్తోంది.బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా  ఏం చేశారని ఇటుగా వస్తున్నారని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అనే లీడర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏమీ ఇవ్వకుండానే ఇటుగా రావడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణిస్తూ సోషల్ మీడియా ద్వారా తాను చెప్పాలనుకున్న నాలుగు మాటలూ చెప్పారు మరియు చెప్పించారు కూడా ! ఇక చంద్రబాబు చేసిన తప్పేంటి ? తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు దారిలోనే తెలంగాణ చంద్రుడు ఎందుకు నడుస్తున్నారు అన్నవి చూద్దాం.

చంద్రబాబు మొదటంతా బాగానే ఉన్నారు. 2014లో అధికారం దక్కాక కూడా బీజేపీతో సఖ్యంగానే ఉన్నారు. కానీ తరువాత ఎక్కడ చెడిందో తెలియదు తనకు బాగా తెలిసిన లేదా తానే గెలిపించిన కొన్ని రాజకీయ శక్తులను బీజేపీ నుంచి డీ యాక్టివ్ కావాలని చెప్పారు.

ఆ విధంగా అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తరువాత కాలంలో సైలెంట్ అయిపోయారు. ఏదో ఒకటి ముందు నుంచి కొంత డైలామాను అయితే ఫేస్ చేశారు బాబు. స్పెషల్ ప్యాకేజీ కి ఒప్పుకుని మళ్లీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడి  అభాసు పాలయ్యారు. బీజేపీతో బంధాలు తెగిపోయాక చంద్రబాబు ఒంటరి అయిపోయారు.

ఇదే విధంగా కేసీఆర్ కూడా కొంత కాలం బీజేపీతో బాగానే ఉన్నారు. వసంత్ విహార్ (దేశ రాజధానిలో ఖరీదయిన ప్రాంతం)లో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం సంపాదించగలిగారంటే కారణంగా ఆ  సఖ్యతే! ఆ తరువాత ఎక్కడో చెడింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలన్న తపనతో మోడీతో గొడవ పెట్టుకున్నారు.

ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు చంద్రబాబు హయాంలో మోడీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగురవేశారు టీడీపీ మిత్రులు.ఇప్పుడు కూడా అలాంటి నిరసనలేవో  కేసీఆర్ బృందం చేపడితే వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబు మాదిరిగానే పరాజయం పొందక తప్పదు అని అమిత్ షాతో పెట్టుకోవడం అంత వీజీ కాదని బీజేపీకి చెందిన తెలంగాణ వర్గాలు అంటున్నాయి. హెచ్చరిస్తున్నాయి కూడా !