ద గ్రేట్ పాల్ : మరి బాబు సంగతేంటి...?

Fri May 13 2022 16:08:49 GMT+0530 (India Standard Time)

The Great Paul: What about Babu ...?

ఆయన కేఏ పాల్. అంతకు ముందు మతారాధకుడు. ఆ విధంగా టీవీల్లో కనిపించేవారు. ఇక 2019 ఎన్నికల ముందు ఆయన ప్రజా శాంతి పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయినా ఆయన ప్రజా నాయకుడిగా టీవీలలో కనిపిస్తూ హడావుడి చేస్తున్నారు. కేఏ పాల్ సడెన్ గా టీయారెస్ మీద విరుచుకుపడుతున్నారు.ఈ నేపధ్యంలో ఆయన మీద దాడి జరిగింది. దాన్ని ఆయన ఎక్కడ ఫిర్యాదు చేయాలో అక్కడ చేసి వచ్చారు. ఒక విధంగా పాల్ ద గ్రేట్ అనిపించుకున్నారు. కేఏ పాల్ ఇలా అడగడం ఏంటి అలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయనతో తన మీద జరిగిన దాడిని పాల్ చెప్పడమే కాదు తెలంగాణాలో ఉన్న అనేక సమస్యలను ప్రస్థావించాను అని చెప్పారు.

ఇక అన్నీ విన్న అమిత్ షా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పాల్ చెప్పుకున్నారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవమని పాల్ కి సూచించారు అని చెప్పుకున్నారు. రేపో మాపో ఆ ముచ్చట కూడా జరిగే వీలుంది. మొత్తానికి పాల్ బడా పార్టీ నాయకుడు కాడు కానీ ఆయనతో దేశానికే హోం మంత్రి భేటీ అయ్యారు.

సీన్ కట్ చేస్తే ఏపీలో చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గత మూడేళ్ళుగా అమిత్ షాతో పాటు కేంద్ర పెద్దలను కలవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. తన మీద దాడి జరిగింది అంటేనే పాల్ కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి అన్నీ విషయాలు తెలుసులుకున్నారు. సరిగ్గా ఆరు నెలల క్రితం ఏపీలో మంగళరిగి వద్ద ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది.

దాని మీద కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని బాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు కూడా ఉన్నారు. అయినా బాబుకు షా ను కలిసే అవకాశం రాలేదు. మరి దీన్ని ఎలా చూడాలో కూడా తెలియడంలేదు.

మొత్తానికి పాల్ కి అపాయింట్మెంట్ ఇచ్చిన అమిత్ షా జాతీయ స్థాయిలో  రాజకీయ దురంధరుడు చంద్రబాబుకు ఎందుకు ఇవ్వలేదు. ఇది ఒక చర్చగానే ఉంది. ఏది ఏమైనా పాల్ గొప్పోడు సార్ అని అంతా అంటున్నారు. మరి బాబు కూడా అమిత్ షాతో అపాయింట్మెంట్ సంపాదించి గొప్పోడు అనిపించుకోవద్దా.