Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఎన్టీఆర్ వారసుడే: లక్ష్మీపార్వతికి టీడీపీ ఘాటు కౌంటర్
By: Tupaki Desk | 28 May 2023 6:29 PMదివంగత మహానాయకుడు ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు దేవినేని నెహ్రూనేనని.. ఎన్టీఆర్‌కు చివరి వరకు ఆయన వెన్నంటి ఉన్నారని.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతికి టీడీపీ ఘాటు కౌంటర్ ఇచ్చింది.
ఎన్టీఆర్ అల్లుడుగా.. చంద్రబాబు ఎప్పటికీ ఆయనకు వారసుడేనని.. విషయం తెలుసుకోవాలని సూచించింది. ఎన్టీఆర్ శత జయంతి రోజు కూడా విషం కక్కడం మంచిది కాదని హితవు పలికింది. ఈ మేరకు లక్ష్మీ పార్వతిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జీవితంలో చీకటి రోజు లక్ష్మీ పార్వతి ప్రవేశించిన రోజే అని బుద్దా విమర్శించారు. ముందు అది తెలుసుకుని ఆమె మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎన్టీఆర్ కు తన కుమారులు, కుమార్తెలు వారసులేనన్నారు.
అందుకే కొడుకు, కూతురుకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. నారా భువనేశ్వరి భర్తగా, ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబుకు వారసత్వం ఉందన్నారు. వారసుడు కాదని.. లక్ష్మీపార్వతి జగన్ రాజ్యాంగం మేరకు చెబుతున్నారా? అని నిలదీశారు.
లక్ష్మీ పార్వతి వల్లే ఆనాడు టీడీపీలో నాయకులు ఉండలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే ఎంతో నిబద్ధత ఉన్న నాయకులు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారని బుద్దా వెంకన్న చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు టీడీపీని నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడిస్తున్న వారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వారసులు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేషేనని.. పార్టీలోని లక్షల మంది కార్యకర్తలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని విమర్శలు చేస్తున్న వారు గుర్తించాలని చురకలు అంటించారు.