Begin typing your search above and press return to search.

టీడీపీ ఏమి సాధిస్తుంది ?

By:  Tupaki Desk   |   25 July 2021 12:30 PM GMT
టీడీపీ ఏమి సాధిస్తుంది ?
X
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో కోర్టు లిటిగేషన్ కంటిన్యు అవుతోంది. రాష్ట్ర, జిల్లాస్ధాయి గ్రంధాలయ సంస్ధలకు ప్రభుత్వం ఛైర్మన్లుగా నియమించింది. అయితే ఆ నియామకాలు చెల్లవంటు కొందరు కోర్టులో పిటీషవన్ వేశారు. కేసు వేసిన వారెవరయ్యా అంటే చంద్రబాబునాయుడు హయాంలో గ్రంధాలయ సంస్ధలకు ఛైర్మన్లుగా అపాయింట్ అయినవారు. దీనిలోనే టీడీపీ శాడిజం ఏమిటో బయటపడుతోంది.

నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైన వారు సదరు ప్రభుత్వం దిగిపోగానే మాజీలైపోతారు. తమను నియమించిన అధికారపార్టీ ప్రభుత్వంలో నుండి తప్పుకోగానే కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తారు. మరికొందరు ప్రత్యేకంగా రాజీనామాలు చేయకపోయినా కొత్తవారిని పదవుల్లో నియమించగానే అప్పటివరకు ఛైర్మన్లుగా ఉన్నవారు మాజీలైపోతారు.

అయితే తమను తొలగించే అధికారం కొత్త ప్రభుత్వానికి లేదని మాజీలవ్వాల్సిన వారు కోర్టుకెళితే ఏమవుతుంది ? వివాదాస్పదమవుతుందంతే. అధికారులు ఎలాగూ ప్రస్తుత ప్రభుత్వం నియమించిన ఛైర్మన్లకే మద్దతుగా ఉంటారు. దీంతో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళకు, ప్రస్తుత ప్రభుత్వం నియమించిన వాళ్ళకు మధ్య ప్రతిరోజు గొడవలవుతునే ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొత్త ఛైర్మన్లతో గొడవలు పడటానికైనా సిద్ధపడ్డారే కానీ ఛైర్మన్లుగా తాము రాజీనామాలు చేయటానికి మాత్రం ఇష్టపడటంలేదు.

తమను తొలగించటంపై గతంలోనే కొందరు ఛైర్మన్లు కోర్టులో కేసు వేస్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది. ఆ స్టే అలాగుండగానే ప్రభుత్వం తాజాగా కొందరిని ఛైర్మన్లుగా నియమించింది. నియామకాలపై పాత ఛైర్మన్లు మళ్ళీ కోర్టులో కేసువేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు మళ్ళీ స్టేటస్ కో ఆదేశాలా జారీచేసింది. టీడీపీ నేతలు ఎవరైనా తమ ఛైర్మన్ పోస్టులను వదులుకోవటానికి ఇష్టపడకపోతే చంద్రబాబు పిలిపించి రాజీనామాలు చేయమని చెప్పాలి. ఎందుకంటే కోర్టులకు వెళ్ళినా వాళ్ళు సాధించగలిగేది ఏమీ ఉండదు కాబట్టి.

గ్రంధాలయ సంస్ధలే కాదు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కూడా రాజీనామా చేయకుండా కోర్టులో కేసు వేశారు. కోర్టులు రక్షణకు వచ్చినా పాత ఛైర్మన్లు చేయగలిగేదీ ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే. పోస్టుల్లో ఉండటం వల్ల తాము చేయగలిగేది ఏమీ ఉండదు, కొత్తవారిని బాద్యతలను తీసుకోనీయరంతే. దీన్నే శాడిజం అంటారని వైసీపీ నేతలంటున్నారు. వీళ్ళంతా కోర్టుల్లో కేసులు వేశారంటే పరోక్షంగా చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరుగుతోందని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.