Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు మేనిఫెస్టోలో వీళ్ల‌కు చోటు లేదే...!

By:  Tupaki Desk   |   31 May 2023 1:00 PM GMT
చంద్ర‌బాబు మేనిఫెస్టోలో వీళ్ల‌కు చోటు లేదే...!
X
తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మేనిఫెస్టోపై ఆయ‌న ప్ర‌క‌టించిన క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించిచంద్ర‌బాబు అనూహ్యం గా ప్ర‌క‌టించిన మేనిఫెస్టో తొలి ద‌శ‌లో మ‌హిళ‌లు, వృద్ధులు, రైతులు, యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా వ‌ర్గాల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు బీజం వేశారు. ముఖ్యంగా న‌గ‌దు పంపిణీ ప‌థ‌కాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

అయితే.. ఈక్ర‌మంలోనే స‌మాజంలోని మ‌రికొన్ని వ‌ర్గాలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నా యి. వీరిలో ప్ర‌ధానంగా ఉద్యోగులు.. కాపులు.. పెట్టుబ‌డి దారులు.. కాంట్రాక్ట‌ర్లు.. ఉన్నారు. ఈ నాలుగు వ‌ర్గాల వారికి కూడా.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. పెట్టుబ‌డిదారులు రాష్ట్రాన్ని వీడిపోయార‌ని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అదే స‌మయంలో కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో వారు కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసు కున్నారు. ఇక‌, ఉద్యోగుల స‌మ‌స్య‌లు ఎక్క‌డివ‌క్క‌డే ఉన్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌క‌టించిన 43 శాతం ఫిట్‌మెంట్ త‌ర్వాత‌.. ఆ రేంజ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచింది లేదు.

దీనికి తోడు నెల‌నెలా 1నే జీతాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. సో.. వీరు కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ద‌న్నుగా ఉండే పార్టీవైపు మొగ్గు చూపాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కానీ, తాజా మేనిఫెస్టోలో చంద్ర‌బాబు ఉద్యోగుల ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. అలాగే కాంట్రాక్ట‌ర్ల ప్ర‌స్తావ‌న కూ డా లేకుండా పోయింది. ఇక‌, పెట్టుబ‌డి దారుల విష‌యంపైనా చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారు.

ప్ర‌స్తుతం పెట్టుబడులు లేక‌.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దిగాలుగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ దూకు డుగా ఉండ‌గా.. ఏపీ మాత్రం నిద్రాణంలో ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నాలుగు వ‌ర్గాల‌కు.. చంద్ర‌బాబు వ‌చ్చే పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇస్తార‌నే చ‌ర్చ‌సాగుతోంది.