Begin typing your search above and press return to search.

మేనిఫెస్టో హ్యాపీసే.. కానీ.. ఇన్‌క‌మ్‌.. మాటేంటి? మేధావుల మాటేంటంటే!

By:  Tupaki Desk   |   31 May 2023 8:00 AM GMT
మేనిఫెస్టో హ్యాపీసే.. కానీ.. ఇన్‌క‌మ్‌.. మాటేంటి?  మేధావుల మాటేంటంటే!
X
ఇటీవల జరిగిన మహానాడు రెండు రోజుల పండుగ లో చంద్రబాబునాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి గెలిచి తీరాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ మినీ మేనిఫెస్టో పై రాసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అత్యధిక ధన వ్యయంతో కూడుకున్నవి కావడం గమనార్హం.

ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి ఇస్తామ‌ని, లబ్ధిదారులందరికీ ఎంతమంది పిల్ల‌లు ఉన్నా ఇస్తామని చంద్ర‌బాబు వాగ్దానం చేశారు. అయితే ఒక్కొక్క కుటుంబంలో కనీసం ఇద్దరు చొప్పున వేసుకున్న లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు అందుతున్నటువంటి వారి కన్నా కూడా రెట్టింపు మూడు రెట్లు అయినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన యువ‌తులు, మహిళలకు 1500 రూపాయలు చొప్పున ప్రతినెల ఇస్తామ‌ని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు.

కాబట్టి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు పదేపదే అనేక సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా టిడిపి నాయకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. దీంతో ఈ చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో బాగానే ఉంది అనే టాక్ అయితే వినిపిస్తున్నప్పటికీ ఈ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి చంద్రబాబు నాయుడు చేయాల్సింది నమ్మకం కలిగించాలి.

నమ్మకం కలిగించడం ఒకటే ఇప్పుడు ప్రధాన మార్గంగా ప్రధాన సూత్రంగా ఈ మేనిఫెస్టోకు మిగిలింది. దండలో దారంలాగా నమ్మకం అనేటటువంటిది గనక చంద్రబాబు నాయుడు బిల్డప్ చేయకపోతే ఈ మేనిఫెస్టోను నమ్మేటటువంటి పరిస్థితి లేదని అత్యధిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉచితాలు ఇవ్వడం అనేటటువంటిది అందరూ ఇచ్చారు. జగను ఇస్తున్నాడు ఇతర రాష్ట్రాల్లో ఆదాయం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే అక్కడ దళిత బంధు కార్యక్రమం కింద ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నారు.

అక్కడ ఆదాయం కనిపిస్తోంది. హైదరాబాదు నుంచి కావచ్చు వరంగల్ నుంచి కావచ్చు నిజామాబాద్ నుంచి కావచ్చు కొంత ఆదాయం అయితే ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఆ తరహా ఆదాయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించడం లేదు. గతంలో అమరావతిలో సంస్థలు వస్తే ఆదాయం వస్తుందని భావించారు. అయితే అమరావతిని నాశ‌నం చేయ‌డం కారణంగా అక్కడ ఆదాయం కోల్పోయాం. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు వెళ్లిపోయాయి. దీంతో విశాఖపట్నం నుంచి వచ్చేటటువంటి ఆదాయం పోయింది. పెట్టుబడులు రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఆదాయం అనేటటువంటిది కేవలం పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మాత్రమే. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి దన్నుగా మారింది. ఈ పరిస్థితిని మార్చి వచ్చే ఆదాయాన్ని పెంచేటటువంటి మార్గాల వైపు చంద్రబాబు నాయుడు దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటించి నేను సంక్షేమ పథకాల నేను అమలు చేస్తాను అని చెప్పుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ దీన్ని అమలు చేయటం దీనికి సంబంధించి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అనేది వివరించడం అనేది ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి కీలక అంశంగా కీలక సవాలుగా కీలక సమస్యగా మారిందని చెప్పాలి.