Begin typing your search above and press return to search.

సరికొత్త రికార్డు.. క్రికెట్ హిస్టరీలో అతి భారీ సిక్స్.. కొట్టిందెవరంటే?

By:  Tupaki Desk   |   20 July 2021 5:01 AM GMT
సరికొత్త రికార్డు.. క్రికెట్ హిస్టరీలో అతి భారీ సిక్స్.. కొట్టిందెవరంటే?
X
బంతి వేసిన వాడు నిద్రలోనూ గుర్తుకు వచ్చే విధ్వంసకర షాట్ తో.. బంతిని భారీగా శిక్షిస్తూ.. కనుచూపు మేర కనిపించకుండా చేసిన వైనం ఇప్పుడు క్రికెట్ క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇంగ్లండ్.. పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేలా.. క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్సర్ గా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ అద్భుతమైన షాట్ కొట్టిందెవరంటే.. విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్ స్టోన్ కొట్టిన ఈ భారీ సిక్సర్ ఇప్పుడు రికార్డుగా నమోదైంది.

ఈ సిక్సర్ 122 మీటర్ల కంటే పొడవైన.. అతి భారీ సిక్సర్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ సిక్సర్ ఏకంగా స్టేడియం పక్కనే ఉన్న రగ్బీ పిచ్ మీద పడినట్లుగా చెబుతున్నారు. ఈ సిక్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా గట్టిగా బాదటంతో అది కనుచూపు మేర కనిపించలేదు. ఈ సిక్స్ ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్ గా వ్యాఖ్యాతలు పేర్కొనటం విశేషం.

ప్రస్తుతం మూడు టీ20 సిరీస్ ఇంగ్లండ్.. పాకిస్థాన్ మధ్య నడుస్తోంది. మొదటి మ్యాచ్ ను పాకిస్థాన్ సొంతం చేసుకుంటే.. తాజా మ్యాచ్ ఇంగ్లండ్ విజయాన్ని సాధించింది. తాజా మ్యాచ్ లో అతిధ్య ఇంగ్లండ్ జట్టు 19.5 ఓవర్లకు 200 పరుగులు చేసి అలౌట్ అయ్యింది. అనంతరం 201 విజయ లక్ష్యంగా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లకు కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో.. లివింగ్ స్టోన్ 42 బంతుల్లోనే సెంచరీ సాధించటం తెలిసిందే.

ఇదే బ్యాట్స్ మెన్ సిరీస్ లోని రెండో మ్యాచ్ లో భారీ సిక్సర్ ను కొట్టి అభిమానుల్ని ఉర్రూతలూగించారు. తాజాగా నమోదైన సిక్స్ అధికారిక పొడవను కొలవటం సాధ్యం కాలేదని చెబుతున్నారు. ఇలాంటి సిక్స్ ను తాము చూడలేదని క్రికెట్ కామెంటేటర్లు.. సీనియర్ ఆటగాళ్లు ఇయాన్ వార్ట్.. కుమార సంగక్కర మ్యాచ్ తర్వాత పేర్కొనటం గమనార్హం. మ్యాచ్ తర్వాత.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ సిక్సర్ వీడియోను షేర్ చేశారు. ఇదేనా అతి భారీ సిక్స్? అన్న ప్రశ్నను సంధిస్తూ కనువిందు చేసిన ఈ భారీ సిక్సర్ క్లిప్ ను షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ భారీ షాట్ ను చూసి ఎంజాయ్ చేయండి.