Begin typing your search above and press return to search.
లోకేశేనా.. ఇలా మాట్లాడింది?
By: Tupaki Desk | 29 May 2023 8:30 PM ISTమే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడు విజయవంతమైన సంగతి తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఘనంగా నిర్వహించింది. కాగా మహానాడులో పలువురు ప్రసంగించినా అందరికీ ఆకట్టుకునేలా సాగింది మాత్రం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగమేనని అంటున్నారు. లోకేశ్ తన స్టన్నింగ్ స్పీచ్ తో టీడీపీ శ్రేణులను ఉర్రూతలూగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మే 28న మహానాడు ముగింపు సభలో లోకేష్ తన ఆవేశపూరిత ప్రసంగంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెంచారు. మహానాడుకు వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం చెబుతున్నానంటూ ప్రసంగం ప్రారంభించిన లోకేష్ ఆద్యంతం అదరగొట్టేలా ప్రసంగించారని టాక్ నడుస్తోంది.
టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, అమెరికాలో దాక్కున్నా, అమలాపురంలో దాక్కున్నా లాక్కొచ్చి జైలుకు పంపుతానని లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీపై నిప్పులు చెరిగారు.
ఎందరో పెద్ద సైకోలను ఎదిరించిన ఘనత టీడీపీకి ఉందని, ఈ పిల్లసైకో (జగన్) ఏమీ చేయలేడని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం.. పసుపు జెండా చూస్తే పూనకం అని పేర్కొనడంతో అరుపులు, ఈలలు, కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్ అని లోకేశ్ అభివర్ణించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది, ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది కూడా ఎన్టీఆరేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది.. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని తెలిపారు.
పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలని.. పార్టీ నడపడానికి క్యాలిబర్ ఉండాలన్నారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌కు హిస్టరీ ఉంది.. పార్టీని నడుపుతున్న చంద్రబాబుకు క్యాలిబర్ ఉందని అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడని లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ ఘన చరిత్ర ఉన్న పార్టీ అని.. వైసీపీ అంటే గలీజు పార్టీ అని పేర్కొన్నారు. వైసీపీది సైకో పాలన అని మండిపడ్డారు. మన చంద్రన్న శ్రీరాముడు అయితే జగన్ సైకో అని తెలిపారు.
చంద్రన్నది అభివృద్ధి అయితే జగన్ ది అవినీతి అని లోకేశ్ మండిపడ్డారు. చంద్రన్న విజనరీ, జగన్ ప్రిజనరీ అని పేర్కొన్నారు. చంద్రన్న నిలబెడితే, జగన్ పడగొడతాడని ఎద్దేవా చేశారు. చంద్రన్న హీరో..జగన్ జీరో అని తెలిపారు. టీడీపీది పక్కా ఇళ్ల పాలసీ అయితే వైసీపీది గుడిసెల పాలసీ అని లోకేశ్ అభివర్ణించారు. ఒక్క చాన్స్‌తో 151 సీట్లు ఇస్తే జగన్ దేశంలోనే ధనిక సీఎం అయ్యాడని గుర్తు చేశారు. పైగా పేదవాడ్ని అంటూ బీద అరుపులు అరుస్తున్నాడని మండిపడ్డారు.
లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు, రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు, రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేశ్ ప్రశ్నించారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ, వైజాగ్‌లలో ప్యాలెసులు ఉన్నవాడు పేదవాడా? అని నిలదీశారు.
సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ అని.. పెద్దయినా బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదల జేబులో జగన్ డబ్బులు కొట్టేస్తున్నాడని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు 8 సార్లు పెంచాడని, ఆర్టీసీ బస్ చార్జీలు 3సార్లు పెంచారని ధ్వజమెత్తారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఇలా అంతా బాదుడే బాదుడు ఉందన్నారు. ప్రతి ఇంటికి జగన్ స్టికర్ అతికిస్తున్నారని మరి కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ బిల్లుపై నీ బొమ్మ వేసుకునే దమ్ముందా సైకో జగన్?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
సెంటు స్థలాల స్కీం పెద్ద స్కాం అని లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల దగ్గర వైసీపీ నేతలు తక్కువ ధరకు భూములు కొని, ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మి రూ.7వేల కోట్లు కొట్టేశారన్నారు. ఎన్నికల ముందు ఇళ్లు తానే కడతా అన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు అప్పు చేసి ఇళ్లు కట్టండి లేకపోతే స్థలం వెనక్కి ఇవ్వండి అని జగన్ బెదిరిస్తున్నాడని ధ్వజమెత్తారు. పేదవాడు 2 రూపాయల వడ్డీకి 10లక్షలు అప్పు తెచ్చి ఇళ్లు కట్టగలడా? జీవితాంతం కష్టపడినా ఆ అప్పు తీరదన్నారు.
పాదయాత్రను అడ్డుకుంటామని పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకూ సవాల్ చేశారని లోకేశ్ గుర్తు చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.. ఎవడొస్తాడో రండి తగ్గేదేలే అంటే అంతా పారిపోయారని ఎద్దేవా చేశారు.