Begin typing your search above and press return to search.

నందమూరి సుహాసిని...గుడివాడా...గన్నవరమా...?

By:  Tupaki Desk   |   7 Jun 2023 4:27 PM GMT
నందమూరి సుహాసిని...గుడివాడా...గన్నవరమా...?
X
నందమూరి వారి ఆడపడుచు, దివంగత నేత నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసినె ఏపీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. ఆమె తెలంగాణా టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉన్నా కూడా ఆమెను ఏపీకి తీసుకుని వచ్చి పోటీకి పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సుహాసిని ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. ఇక తెలుగుదేశం పార్టీ పెద్దలకు అయితే వైసీపీలో కొంతమంది మీద గురి ఉంది. వారిని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ జాబితా తీసుకుంటే కొడాలి నాని ముందుగా వచ్చే పేరు. ఆయన తరువాత వల్లభనేని వంశీ పేరు కూడా ఉంటుంది.

ఈ ఇద్దరినీ ఓడించాలని చంద్రబాబు లోకేష్ ల పంతం పట్టుదల అని చెబుతారు. కొడాలి నాని గుడివాడ నందమూరి వారి సీటు అని ఒక భావన ఉంది. ఎన్టీయార్ 1983లో ఇక్కడ నుంచి ఫస్ట్ టైం గెలిచారు. అందువల్ల ఈ సీటు నందమూరి ఫ్యామిలీకే దక్కాలని కూడా ఉంది. అయితే ఇప్పటికి నాలుగు సార్లు అప్రతిహతంగా కొడాలి నాని ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో ఆయన్ని ఓడించాలి అంటే నందమూరి కుటుంబం నుంచే బరిలోకి దించాలని చూస్తున్నారు. అలా నందమూరి సుహాసిని పేరు తెర పైకి వస్తోంది. ఇక నందమూరి ఫ్యామిలీలో మూడవ తరంలో చురుకుగా ఉన్న మహిళా నేతగా సుహాసిని పేరు వినిపిస్తోంది. మామూలుగా అయితే నందమూరి తారకరత్న బతికి ఉంటే గుడివాడ నుంచి పోటీ చేసేవారు అని అంటున్నారు.

ఆయన హఠాన్మరణంతో ఇపుడు సుహాసినిని తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు తెలంగాణాలో సీటు ఇచ్చినా గెలవదు అని తేలిపోయింది. 2018లో కూకట్ పల్లి నుంచి ఆమెను పోటీకి దించారు కానీ ఓటమి పాలు అయింది. దాంతో ఈసారి ఆమెను గుడివాడ నుంచి పోటీకి పెడితే మహిళా అన్నది ఒకటి ఉంటుంది. పైగా నందమూరి కుటుంబం కూడా కావడంతో ఆమె వైపు గుడివాడ ఓటర్లు టర్న్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ఈ ఆలోచన అంతా నారా లోకేష్ ది అని అంటున్నారు. సుహాసినిని గుడివాడలో పోటీ పెడితే హరిక్రిష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం ని కూడా కంట్రోల్ లో పెట్టవచ్చు అని లోకేష్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు హరి క్రిష్ణ కుమార్తెని పోటీకి టీడీపీ తరఫున పెదితే జూనియర్ ఎన్టీయార్ మా వైపు ఉన్నారని చెప్పుకునేందుకు కూడా వీలు అవుతుందని ఆలోచిస్తున్నారుట. అలా అయితే గుడివాడ లేకపోతే గన్నవరం అన్నట్లుగా నందమూరి సుహాసినిని పోటీకి దింపాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.

ఈ రెండు సీట్లలో ఎక్కడ పోటీకి పెట్టినా ఈసారి సుహాసిని తప్పకుండా గెలుస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎలాగూ జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి కాపు ఓట్లు ఈ రెండు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఉన్నాయని అవి టర్న్ అవుతాయని కూడా భావిస్తున్నారుట.

ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తో పొత్తు వల్ల ఈజీగా ఈ రెండు చోట్లా టీడీపీ గెలవవచ్చు అని ఆలోచిస్తున్నారుట మొత్తానికి చూస్తే టీడీపీ చేతిలో సుహాసిని అనే ట్రంప్ కార్డు ఉంది.

ఆ కార్డుని ఎక్కడ వాడతారు అన్నదే చర్చగా ఉంది. గుడివాడలోనా. లేక గన్నవరంలోనా అన్నదే చూడాలని అంటున్నారు. గుడివాడ లో అయితే గన్న్నవరంలో మరో బలమైన నేతను పోటీకి వెతుక్కోవాల్సి ఉంది. అలా కాదు అనుకుంటే సుహాసినితో పాటు మరో కీలకమైన అభ్యర్ధిని కూడా ఈ సీట్లలో పోటీకి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మరి లోకేష్ కి చూస్తే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మీద కూడా ఆగ్రహం ఉంది అంటున్నారు. ఇద్దరినీ ఓడించేలా లోకేష్ ఏ రకంగా ప్లాన్ చేస్తారు అన్నదే చూడాలని అంటున్నారు.