Begin typing your search above and press return to search.

కొన్ని ప్ర‌శ్న‌ల‌కు సమాధానం వ‌దిలేసిన 'మ‌హానాడు'...!

By:  Tupaki Desk   |   29 May 2023 6:00 PM GMT
కొన్ని ప్ర‌శ్న‌ల‌కు సమాధానం వ‌దిలేసిన మ‌హానాడు...!
X
మ‌హానాడులో చంద్ర‌బాబు రెండు రోజుల పాటు మొత్తంగా నాలుగు సార్లు గంభీర ఉపన్యాసాలు చేశారు. తొలిరోజు ఉద‌యం, సాయంత్రం, రెండోరోజు కూడా ఉద‌యం, సాయంత్రం రెండు సార్లు ఆయ‌న మ‌హానా డును ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా వైసీపీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. దీనికే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. వైసీపీ పాల‌న బాగోలేద‌ని.. జ‌గ‌న్ దోచుకుం టున్నార‌ని చెప్పుకొచ్చారు.

అయితే..నిజానికి మ‌హానాడు ఉద్దేశం పార్టీని గాడిలో పెట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు నేత‌ల‌ను సంసిద్ధుల‌ను చేయ‌డం. ఈ విష‌యంలో నారా లోకేష్ కొంత ప్ర‌య‌త్నం అయితే చేశారు. ఇంచార్జ్‌ల మాట అంద‌రూ వినాల‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో ఇంచార్జ్‌లు కూడా అంద‌రినీ క‌లుపుకొనిపోవాల‌ని నారా లోకేష్ సూచించారు. ఇక‌, స్వ‌చ్ఛందంగా ఎవ‌రు వ‌చ్చినా సేవ‌చేసేందుకు ఆహ్వానిస్తామ‌న్నారు. పార్టీలో టికెట్ల విష‌యంపై ఇప్ప‌టి నుంచి చ‌ర్చ చేయొద్ద‌ని కూడా తేల్చి చెప్పారు.

అయితే.. వీటినిమించిన విష‌యాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిని చంద్ర‌బాబు ప్ర‌స్తావించ‌లేదు. యు వత‌కు 40 శాతం టికెట్లు ఇస్తామ‌ని చెప్పి మాట మాత్రంగా అన్నారే కానీ.. యువ‌త అంటే ఎవ‌రు? అనే చ‌ర్చ‌కు చంద్ర‌బాబు ఎక్క‌డా స‌మాధానం చెప్ప‌లేదు.

వార‌సులే యువ‌త‌గా గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చా రు. దీంతో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న‌వారు కూడా ఇప్పుడు సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. తామువార‌సులం కాదు కాబ‌ట్టి టికెట్లు ఇస్తారో ఇవ్వ‌రో అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. వైసీపీ నేత‌ల‌కు ట‌చ్‌లోకి వెళ్తున్న నాయ‌కులు కూడా పెరుగుతున్నారు. వీట‌ని నిలువ‌రించేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహాల‌పైనా.. ఆయ‌న దృష్టి పెట్ట‌లేక పోయారు.

దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో హ్యాట్రిక్ ప‌రాజ‌యం పొందుతున్న‌నేప‌థ్యంలో ఆయా నియోక‌వ‌ర్గాల్లో ఎలా ముందుకు సాగుతార‌నే విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌స్తావించ‌లేదు. దీంతో ఇప్పుడు ఇవి స‌మాధానం లేని ప్ర‌శ్న‌లుగానే ఉండిపోయాయి.