Begin typing your search above and press return to search.

లోకేష్ పాద‌యాత్ర‌... త‌మ్ముళ్ల‌కే ఇన్ని డౌట్లు ఉన్నాయా..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 5:22 AM GMT
లోకేష్ పాద‌యాత్ర‌... త‌మ్ముళ్ల‌కే ఇన్ని డౌట్లు ఉన్నాయా..!
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై అప్పుడే ఆశ‌క్తికర చ‌ర్చ సాగుతోంది. అది కూడా టీడీపీ నాయ‌కుల మ‌ధ్యే కావ‌డం గ‌మ‌నార్హం.వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య తీరాల‌కు చేర్చాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్‌తో పాద‌యాత్ర చేయించాల‌ని నిర్ణ‌యించారు.

దీనికి ముహూర్తం కూడా ఖ‌రారైంది. 4000 కిలో మీట‌ర్లు, 400 రోజులు అనే కాన్సెప్టుతో ఈ పాద‌యాత్ర‌ను ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. దీనిపై పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు.. పెద‌వి విరుస్తున్నారు. ఎందుకంటే.. పాద‌యాత్ర చేసేవారి ఇమేజ్‌.. వారికి స్థాయి అత్యంత కీల‌కం. గ‌తంలో వైఎస్ పాద‌యాత్ర చేశారు. అప్ప‌టికి..ఆయ‌న సీఎల్‌పీ లీడ‌ర్‌. త‌ర్వాత జ‌గ‌న్ చేశారు. అప్ప‌టికి ఆయన పార్టీ అధినేత‌, ఎమ్మెల్యే, ప్ర‌తిప‌క్ష నాయకుడు.

చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం చేశారు. అది కూడా ఆయ‌న మాజీ సీఎం హోదాలో. మ‌రి లోకేష్ పాద‌యా త్ర ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న‌కు ఉన్న హోదా ఏంటి? కోరితెచ్చుకున్న ఎమ్మెల్సీ హోదా త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఇచ్చిన హోదా ఏమీలేదు.

మ‌రి.. దీనికి ప్ర‌జ‌ల నుంచి ద‌క్కే.. స‌పోర్టు ఎంత అనేది ప్రశ్న‌. అదే స‌మ‌యం లో టీడీపీ అనుకూల ఓటు బ్యాంకుగా మారుతున్న స‌మ‌యంలో లోకేష్ పాద‌యాత్ర అవ‌స‌ర‌మా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఎందుకంటే.. లోకేష్ పాద‌యాత్ర చేయాల‌ని ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు.

అయినా.. పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు క‌నుక‌.. త‌ప్ప‌దు చేయాల్సిందే. అయితే.. ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరిలో ఓడిన లోకేష్‌.. ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? ఆయ‌నా పార్టీ అదినేత కాదు. ప్ర‌జ‌ల‌కు ఏమైనా హామీలు ఇవ్వ‌డా నికి. లేదా.. కాపు నాయ‌కులు రేపు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌మ రిజ‌ర్వేష‌న్ ప‌రిస్థితి ఏంటంటే.. ఏం చెబుతారు? పోల‌వ‌రం ప్ర‌జలు.. ప‌రిహారం ప్ర‌శ్నిస్తే.. హోదా గురించి నిల‌దీస్తే.. సో.. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి.

వీటికి స‌మాధానం ఏం చెబుతారు? అనేది ప్ర‌శ్న‌, అదే స‌మ‌యంలో మంగ‌ళ‌గిరిలో తానే గెల‌వ‌ని నాయ‌కుడు.. రాష్ట్రంలో టీడీపీని గెలిపిస్తారా? అనేది ఇక‌, స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా త‌మ్ముళ్ల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.