Begin typing your search above and press return to search.
మరోసారి బాబు..బాలయ్య.. లోకేశ్ లపై విరుచుకుపడిన కొడాలి నాని
By: Tupaki Desk | 29 May 2023 2:00 PMఒకప్పటి తన బాస్ చంద్రబాబు మీద మరోసారి ఘాటైన విమర్శలు చేశారు మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్ని నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్న కొడాలి నాని.. శత జయంతి ఉత్సవాల పేరుతో చంద్రబాబు పొగిడించుకుంటున్నారన్నకొడాలి నాని.. పనిలో పనిగా బాలక్రిష్ణ.. లోకేశ్.. పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. చంద్రబాబును పొగిడేందుకే మహానాడు పెట్టారని.. చంద్రబాబును ఇంద్రుడు.. చంద్రుడు అని పొగుడుతున్నారన్నారు.
మహానాడు వేదిక మీద బాలక్రిష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదన్న ప్రశ్న వేసిన కొడాలి నాని.. లోకేశ్ ఫోటోను ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిర్వహించలేదని.. వైఎస్సార్ 2004లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. మేనిఫేస్టోలో ఇచ్చిన పథకాలే కాదు.. చెప్పని పథకాల్ని సైతం అమలు చేశారన్నారు.
2014లో రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని.. డ్వాక్రారుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదన్నారు. ఐదేళ్ల వ్యవధిలో చంద్రబాబు పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.
సెంటు స్థలం సమాధికి సరిపోదన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వెంట ఉన్నది రామోజీ, రాధాక్రిష్ణ.. బీఆర్ నాయుడు.. పవన్ కల్యాణ్ అన్న కొడాలి నాని.. వీళ్లెవరు బీసీలు కాదన్నారు.
చంద్రబాబుకు అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారన్న కొడాలి..చంద్రబాబుకు పవర్ ఇస్తే తన సామాజికవ ర్గానికే మంత్రి పదవువు ఇస్తారన్నారు. టీడీపీ హయాంలో లోకేశ్ కు తప్పించి.. ఏపీలో ఇంకెవరికి ఉద్యోగం రాలేదంటూ ఫైర్ అయ్యారు.