Begin typing your search above and press return to search.

జగన్ అర్జంట్ క్యాబినెట్ మీటింగ్...ముందస్తు కేనా...?

By:  Tupaki Desk   |   30 May 2023 9:30 AM GMT
జగన్ అర్జంట్ క్యాబినెట్ మీటింగ్...ముందస్తు కేనా...?
X
ఏపీలో ముందస్తుకు ముహూర్తం ఖరారు అయిందా. ఆ పని మీదనే జగన్ ఢిల్లీ వెళ్లి మూడు రోజులు అక్కడ మకాం వేసి మరీ కేంద్ర పెద్దలతో భేటీ అయింది అన్న చర్చ సాగుతోంది. ఇక అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా ఉందనే అంటున్నారు. ఈ నపధ్యంలో అతి కీలకమైన పరిణామం ఒకటి చోటు చేసుకోబోతోంది. జూన్ 7న అత్యవసర క్యాబినేట్ సమావేశం జగన్ అధ్యక్షతన జరగనుంది అని అంటున్నారు.

ఈ సమావేశంలో ముఖ్య అజెండా ముందస్తు ఎన్నికలు అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణాతో పాటు ఏపీ ఎన్నికలు జరపడమే అని అంటున్నారు. అలా ఎన్నికలు ఆరు నెలలు ముందుకు జరిపేందుకే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల నుంచి అనుమతి తీసుకున్నారు అని అంటున్నారు. ఆరు నెలల ముందు ఎన్నికలు జరగడం వల్ల రాజకీయంగా ఆర్ధికంగా ఇతరత్రా వైసీపీకి భారీ ఊరట లభిస్తుంది అని అంటున్నారు.

ఏపీలో ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి కేసు కీలకమైన దశకు చేరుకుంది. ఇది ఇంకా ముందుకు వెళ్తే మరింత ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అలాగే ఏపీలో విపక్షాలు జోరు ఒక్కసారిగా పెంచేశాయి. తెలుగుదేశం అయితే డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఊహించే మహానాడులో ఎన్నికల ప్రణాళికను సైతం విడుదల చేసేంది.

ఇంకో వైపు లోకేష్ పాదయాత్ర జోరుగా సాగుతూంటే చంద్రబాబు జిల్లా టూర్లు చేస్తున్నారు. బయటకు చెప్పకపోయినా టీడీపీ చాలా వరకూ అభ్యర్ధులను కూడా ఎంపిక చేసి పెట్టుకుందని అంటున్నారు. అదే విధంగా వైసీపీ కూడా తనకు ఉన్న సర్వే నివేదికల ఆధారంతో వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే లోక్ సభ ఎన్నికల ప్రభావం కూడా పడుతుంది అని అంటున్నారు ఆ విధంగా ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదన్నది వైసీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇక తెలంగాణా ఎన్నికలు జరిగితే బీయారెస్ మళ్ళీ గెలిచినా లేక కాంగ్రెస్ గెలిచినా ఆ రెండు పార్టీలు ఏపీతో రాజకీయం మొదలెడతాయన్న ఆలోచనలూ వైసీపీకి ఉన్నాయని అంటున్నారు

ఇక బీజేపీకి తెలంగాణాలో ఏ మాత్రం బలం పెరిగినా ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు అవి తెర తీస్తాయని అనవసరం పోటీలు పొత్తులు ఎత్తులు ఎందుకు అన్నట్లుగా తెలనగణాతో పాటే ఎన్నికలకు సిద్ధపడాలని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. ఇక కేంద్ర బీజేపీ పెద్దలు కూడా తెలంగాణాతో పాటు ఏపీకి ఎన్నికలు జరిగితే రెండు చోట్ల తమ రాజకీయ వ్యూహాలను అమలు చేయవచ్చు అని ఆలోచిస్తున్నారుట.

కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తే అది చాలా ఇబ్బందిగా మారుతుందన్న ఆలోచనలు బీజేపీకి ఉన్నాయని అంటున్నారు. టోటల్ గా కేంద్ర హోం మంత్రితో భేటీ తరువాత అత్యవసర మంత్రి వర్గ సమావేశానికి సిద్ధపడుతున్నారు అంటే అది ముందస్తుకే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.