అదిరిపోయే ఫోటో : జగన్..పవన్..చంద్రబాబు ఒకే ఫ్రేమ్ లో

Mon Aug 15 2022 15:28:46 GMT+0530 (IST)

Jagan, Pawan, Chandrababu in the same frame

అవును ఇది అందరూ చూడాలనుకుంటున్న ఫోటో. అందరి మదిలో ఉన్న కోరిక కూడా. రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉన్నా కూడా అంతా కలసి అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలని రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరం అయితే ఒక్కటి కావాలని జనాలు కోరుకుంటారు. అయితే ఏపీలో పొలిటికల్ సీన్ మాత్రం వేరుగా ఉంటోంది. రాజకీయ ప్రత్యర్ధులు కాస్తా ఇక్కడ శత్రువులుగా మారిపోతున్నారు. దాంతోనే కధ అడ్డం తిరుగుతోంది.అయితే వీటికి తొలిసారి చెక్ పెడుతూ తొలిసారిగా ఏపీకి చెందిన కీలక నాయకులు అంతా రాజ్ భవన్ వేదికగా ఎట్ హోం లో కనిపించబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేళ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం పేరిట తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ విందుకు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలతో పాటు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులుక్ కీలక నేతలను ప్రముఖులను పిలుస్తారు. సందడిగా ఎట్ హోం కార్యక్రమం సాగుతూ వస్తుంది.

అయితే ఈసారి సందడితో పాటు పొలిటికల్ గ్లామర్ కి కూడా ఎట్ హోం ఆస్కారం ఇస్తుంది అంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ వస్తూంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరవుతున్నారు. అలాగే జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో ఇప్పటిదాకా కనిపించలేదు. ఆ మాటకు వస్తే పవన్ జగన్ ఎపుడూ ఎక్కడా కూడా తారసపడలేదు.

దాంతో జగన్ పవన్ కనుక ఎట్ హోం కి వస్తే అది చాలా ముచ్చటైన సీన్ గా ఉంటుంది. అసలు ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడితే ఏమి మాట్లాడుకుంటారు అన్నది కూడా చర్చగా ఉంటుంది. పవన్ జగన్ అంటే ఒక్క లెక్కన విరుచుకుపడతారు. జగన్ సైతం పవన్ని దత్తపుత్రుడు అని టీజ్ చేస్తారు. అలాంటిది ఇద్దరూ ఒక చోట కలిస్తే ఆ సీన్ వారెవ్వా అనిపించకమానదు. మరో వైపు చంద్రబాబు రాక కూడా ఆసక్తిని కలిగించేదే.

ఆయన గత ఏడాది అసెంబ్లీకి రాం రాం అనేశారు. తన సతీమణిని సభ అవమానించింది అంటూ ఆయన సభకు దండం పెట్టేశారు. మళ్ళీ సీఎం గానే తాను సభలోకి అడుగుపెడతాను అని చంద్రబాబు శపధం చేశారు కూడా. దాంతో బాబు జగన్ మళ్ళీ ఎదురుపడిన సందర్భాలు లేవు. ఇపుడు గవర్నర్ ఎట్ హోం పుణ్యమాని ఈ ఇద్దరు కూడా ఎదురుపడబోతున్నారు. మరి బాబుతో జగన్ ఏమైనా మాట్లాడుతారా అన్నది కూడా ఆసక్తిని రేకెత్తించే అంశమే.

ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది. సినీ నటి పొలిటికల్ గ్లామర్ అయిన మంత్రి రోజా కూడా ఫస్ట్ టైం ఎట్ హోం కి హాజరవుతున్నారు. ఆమె క్రిష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో ఈ తేనీటి విందునకు హాజరవుతున్నారుట. మొత్తానికి చూస్తే పవన్ రోజా సినీ గ్లామర్ తో ఉంటారు. అలాగే బాబు జగన్ పొలిటికల్ గ్లామర్ ఇస్తారు. సో ఎట్ హోం ఈసారి మెరుపులు మెరిపించడం ఖాయమే అంటున్నారు.