Begin typing your search above and press return to search.

వారాహి ఫైనాన్స్ ఎన్నారై టీడీపీ నా...?

By:  Tupaki Desk   |   7 Jun 2023 8:00 PM GMT
వారాహి ఫైనాన్స్ ఎన్నారై టీడీపీ నా...?
X
వారాహి రధం ఇపుడు జనాంలోకి వచ్చేస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ నెల 14 నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రధమెక్కి గోదావరి జిల్లాల్లో సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే జనసేన రిలీజ్ చేసింది. ఇక పవన్ అన్నవరం సత్యనారాయణస్వామి వారి దర్శనం చేసుకుని వారాహి ఎక్కి కత్తిపూడి జంక్షన్ వద్దకు రావడమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీ అభిమానులు హోరెత్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా వారాహి రధయాత్రకు సంబంధించి మరి కొన్ని ఇంటెరెస్టింగ్ అప్డేట్స్ ఇపుడు ఒక గాసిప్స్ గా బయటకు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళూ వస్తాను అంటూ తెగ హడావుడి చేసిన వారాహి షెడ్డుకే ఆరేడు నెలల పాటు పరిమితం అయింది. ఎవడురా మనల్ని ఆపేది అంటూ వారాహి ని ముందుంచుకుని జనసేన పెద్దలు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అలాంటిది వారాహి అనుకున్న టైం కి రాకుండా అనుకోని టైం కి అనూహ్యంగా జనంలోకి వస్తోంది. దీని వెనక కధేంటి, వారాహి వంటి భారీ బడ్జెట్ పొలిటికల్ యాత్రకు స్పాన్సరింగి ఎవరు చేస్తున్నారు వంటి విషయాల మీద పుకార్లుగా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. అవేంటి అంటే ఎన్నారై టీడీపీ వింగ్ నుంచి వారాహి రధయాత్ర మొత్తం ఖర్చులకు ఫైనాన్సింగ్ చేస్తున్నారు అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఒకటి సాగుతోంది.

అంతే కాదు వారాహి రధ యాత్ర సూపర్ హిట్ చేసేందుకు మీడియా మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫైనాన్స్ ని కూడా భరించేందుకు టీడీపీకి చెందిన ఎన్నారై వింగ్ ఓకే చెప్పిందని అంటున్నారు. అంటే జనసేన అధినేత వారాహి రధయాత్రకు టీడీపీ ఎన్నారై వింగ్ ఫండింగ్ ఇస్తోంది అంటే అపుడే చుట్టాలైపోయారన్నమాట అన్న సెటైర్లు కూదా పడుతున్నాయి.

నిజానికి బయటకు అఫీషియల్ గా టీడీపీ జనసేన పొత్తులు కుదరలేదు కానీ ఇంటర్నల్ గా రెండు పార్టీల అధినేతల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని అంతా అంటూంటారు. చంద్రబాబు పవన్ ఇద్దరూ కలసి జగన్ కి గురి పెట్టారు. ఏపీలో జగన్ అధికారంలో ఉండకూడదు అని చంద్రబాబు సీఎం కావాలని పవన్ కోరుకుంటున్నారు అని వైసీపీ పదే పదే ఆరోపిస్తూంటుంది.

దానికి తగినట్లుగా నేను సీఎం రేసులో లేనని ఇటీవల చెప్పేసి పవన్ అయోమయాన్ని తన సొంత పార్టీలో లేకుండా చూసుకున్నారని అంటున్నారు. ఇక ఎన్నికలు అంటే వందల వేల కోట్ల బడ్జెట్ వ్యవహారం. యాత్రలు చేయాలన్నా రాజకీయాలు చేయాలన్నా కూడా మునుపటి రోజులు కావు పెద్ద ఎత్తున ఖర్చు అవుతూంటాయి. దాంతో ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. అంతే కాదు ఫండింగ్ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేవారు ఉండాలి.

ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నారై టీడీపీ వింగ్ గట్టిగా కోరుకుంటోంది. పెద్ద ఎత్తున విరాళాలను కూడా సేకరించే పనిలో ఆ వింగ్ ఉందని కూడా ప్రచారంలో ఉన్న మాట. దాంతోనే మిత్రపక్షం గా ఉన్న జనసేనకు కూడా తగినంత సాయం చేసేందుకు టీడీపీ ఎన్నారై వింగ్ ముందుకు వచ్చిందని అంటున్నారు.

మొత్తానికి ఇది ఎంతవరకూ నిజం అన్నది పక్కన పెడితే టీడీపీ జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి యాంటీగా తలపడుతున్న వేళ సాయం చేయడం అంటే అది సహజంగా జరిగే విషయమే అని అంటున్నారు. ఏది ఏమైనా వారాహీకి హంగూ ఆర్భాటమే కాకుండా అర్ధబలం కూడా సమకూరుతోంది కాబట్టి ఇక యాత్రను రక్తి కట్టించడం జనసేనాని పవన్ కళ్యాణ్ మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.