అంబటి సవాల్‌కు పవన్ సిద్ధమేనా?

Tue Aug 16 2022 20:00:01 GMT+0530 (IST)

Is Pawan ready for that challenge?

జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శల కోసమే ప్రత్యేకంగా వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నేతల్లో ఒకరిగా అంబటి రాంబాబును చెబుతుంటారు. గతంలోనూ పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్‌పై వాడివేడి విమర్శలు చేసిన అంబటి రాంబాబు మరోసారి ఆయనకు చాలెంజ్ విసిరారు.కాటన్ దుస్తుల చాలెంజులు కాదని.. 175 సీట్లలో పోటీ చేస్తారో లేదో స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా ప్రకటించాలని అంబటి సోషల్ మీడియాలో పవన్ కు సవాల్ విసిరారు.

కొద్ది రోజుల క్రితం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటన్ దుస్తులు ధరించి ఫొటోలు పెట్టాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌కు చాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో తాను చేనేత బట్టలు ధరించి దిగిన ఫొటోలను ట్విట్టరులో పవన్ పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు.. కాటన్ దుస్తుల చాలెంజులు ఆపి 175 సీట్లలో పోటీ చేస్తున్నారో లేదో ప్రకటించాలని సవాల్ విసిరారు. కాగా అంబటి ట్వీటుపై పవన్ కల్యాణ్ అభిమానులు చేనేత సామాజికవర్గానికి చెందినవారి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చేనేత దుస్తులు ధరిస్తూ వారికి పవన్ అండగా ఉంటుంటే కాటన్ దుస్తుల చాలెంజుల ఆపమంటున్నారని.. ఒక నెటిజన్ మండిపడ్డాడు. పవన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడం వల్ల చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరిగిందని అంటున్నారు. దీంతో ఒక వస్త్రం నేసేవాళ్లు రెండు వస్త్రాలు నేస్తున్నారని.. పవన్ వల్ల చేనేత దుస్తులకు డిమాండ్ పెరిగిందని ట్వీట్లు చేస్తున్నారు.

మరికొంతమంది అంబటి.. జగన్ కు పాలేరు కుక్క అని.. కాపుల్లో చెడబుట్టిన వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. పవన్ ను తిట్టడానికే జగన్ అంబటిని పెట్టుకున్నారని జగన్ దగ్గర కుక్కలాగా పడి ఉంటున్నాడని విమర్శిస్తున్నారు. ఇందుకు తప్ప జగన్ దగ్గర అంబటికి ఏ విలువా లేదని నిప్పులు చెరుగుతున్నారు.