Begin typing your search above and press return to search.

టికెట్ ఇస్తే గెలుస్తాం.. చంద్ర‌బాబుకు విన్న‌పాలు.. ఎవ‌రంటే!

By:  Tupaki Desk   |   23 Jun 2023 12:30 PM IST
టికెట్ ఇస్తే గెలుస్తాం.. చంద్ర‌బాబుకు విన్న‌పాలు.. ఎవ‌రంటే!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు విన్న‌పాలు పెరుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబందించి త‌మ‌కు టికెట్ ఇవ్వాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయ‌న మాత్రం గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ, ఎంత గుంభ‌నంగా ఉన్నా.. కొంత మంది నుంచి మాత్రం బాబు త‌ప్పించుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ముగ్గురు కీల‌క యువ నాయ‌కురాళ్లు.. చంద్ర‌బాబు చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు.

వీరిలో శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న గౌతు శిరీష ముందు వరుస‌లో ఉన్నా రు. వ‌చ్చేఎన్నిక‌ల‌కు సంబంధించిత‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని ఆమె చంద్ర‌బాబును కోరుతున్నారు.

వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి టికెట్ తెచ్చుకుని పోటీ చేసిన గౌతు.. ఓట‌మి పాల‌య్యారు. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండో సారి పోటీ చేసిన వైసీపీ నాయ‌కుడు సీదిరి అప్ప‌ల‌రాజు విజ‌యం ద‌క్కించుకు న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మంత్రిగా ఉన్నారు.

పైగా మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన సీదిరిని ఓడించేందుకు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కోసం చంద్ర‌బాబు అన్వేషిస్తున్నారు. దీంతో గౌతు శిరీష ఆందోళ‌న చెందుతున్నారు. ఇక‌, ఉమ్మడి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ కోసం క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం.. బండారు శ్రావ‌ణి ఎదురు చూస్తున్నారు.

ఇక్క‌డ నుంచి ఈమె కూడా.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి వైసీపీ పై ఓడిపోయారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన బండారుకు ఇప్పుడు టీడీపీలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.

దీంతో ఇక్క‌డ నుంచి ఎం.ఎస్ రాజును నిల‌బెడ‌తార‌నే ప్ర‌చారం ఉండ‌డంతో ఆమె ఏడాది ముందు నుంచి త‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు... ఉమ్మ‌డి శ్రీకాకుళంలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి క‌కుమార్తె.. గ్రీష్మ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఇక్క‌డ కోండ్రు ముర‌ళి ఉన్నారు.

దీంతో చంద్ర‌బాబు ఏమీ తేల్చ లేక ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభిస్తున్నార‌నేటాక్ వినిపిస్తోంది. చివ‌ర‌కు ఈ టికెట్ల‌ను ఎవ‌రికి కేటాయించినా.. వివాదాలు మాత్రం ఖాయంగా క‌నిపిస్తున్నాయి.