Begin typing your search above and press return to search.

రియల్ ఫ్యాక్ట్ : జగన్ మూడ్ పాడు చేసిన జీవీఎల్...?

By:  Tupaki Desk   |   14 May 2022 4:37 PM GMT
రియల్ ఫ్యాక్ట్ : జగన్ మూడ్ పాడు చేసిన జీవీఎల్...?
X
ఆయన వైసీపీకి విపక్షంలో ఉన్నపుడు బాగా నచ్చేవాడు. ఆయన తెల్లారి లేస్తే చంద్రబాబు మీద చెడుగుడు ఆడేసేవారు. దాంతో వైసీపీకి ప్రియతమ నేతగా మారిపోయారు. ఇక వైసీపీ పవర్ లోకి వచ్చిన కొత్తల్లో కూడా ఆయన పెద్దగా సౌండ్ చేసేవారు కారు. కానీ ఈ మధ్యనే ఆయనలో టోటల్ చేంజి కనిపిస్తోంది. ఇపుడు వైసీపీ వారే ఆయన టోన్ మారింది అని అంటున్నారు. కొందరైతే టీడీపీ వాయిస్ జీవీఎల్ టోన్ లో అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసింహారావు మాత్రం ఇపుడు వైసీపీ సర్కార్ మీద రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్దల మీద పడ్డారు. అమరావతి రాజధాని గ్రామాల్లో తిరుగుతూ ఆయన ఒక రియల్ ఫ్యాక్ట్ ని జనాలకు చెప్పేశారు. మూడూ లేదు, వైసీపీకి అంత మూడ్ లేదూ అని అమరావతి రైతులకు శుభ వార్త వినిపించారు.

ఊరకే మూడు రాజధానులు అని చెబుతారు కానీ అది అయిపోయిన సినిమా అని జీవీఎల్ అంటున్నారు. అమరావతి అన్నది నిజం. మూడు రాజధానులు అన్నవి భ్రమ అని క్లారిటీగా చెబుతున్నారు.

దానికి ఆయన చెప్పిన రీజన్స్ కూడా లాజిక్ కి తగినట్లుగా ఉన్నాయి. నిజానికి మూడు రాజధానుల మీద అంత చిత్తశుద్ధి ఉంటే అమరావతి విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టుకు ప్రభుత్వం అప్పీల్ కి వెళ్లాలి కదా అని లా పాయింటే జీవీఎల్ లేవదీశారు.

అది అసలు జరగలేదు కదా. అంటే దాని అర్ధమేంటి. నిజానికి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఏపీ సర్కార్ కి సానుకూలంగా తీర్పు రాదు అని జీవీఎల్ అంటున్నారు. అంతే కాదు అమరావతి అన్నది నికరం అయినందువల్లనే వైసీపీ సర్కార్ మళ్లీ మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో మార్చి పెడతామని చెప్పి కూడా పెట్టలేదు అని గుర్తు చేశారు. మొత్తానికి కేవలం రాజకీయం కోసమే మూడు పాట పాడారని, ఆ వంకతో అమరావతిని కూడా నిర్లక్ష్యం చేశారని అంటున్నారు.

ఇక్కడ జీవీఎల్ చెప్పారని కాదు కానీ ఆరు నెలల క్రితం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం ఇపుడు ఆ ఊసే లేకుండా గమ్మున ఉంది. మంత్రులు కూడా దాని మీద పెద్దగా మాట్లాడడంలేదు. మరి దీని భావమేమి జగదీశా అంటే సమాధానం ఉంటుందా. ఏది ఏమైనా జీవీఎల్ వచ్చి జగన్ మూడ్ పాడు చేశారా. లేక మూడు రాజధానుల విషయంలో కఠిన నిజాలే చెప్పారా. ఏమో జవాబు కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.