Begin typing your search above and press return to search.

వన్డే చరిత్రలోనే తొలి వికెట్ టేకర్ కన్నుమూత.. అతడి రికార్డులెన్నో?

By:  Tupaki Desk   |   2 Nov 2022 11:30 AM GMT
వన్డే చరిత్రలోనే తొలి వికెట్ టేకర్ కన్నుమూత.. అతడి రికార్డులెన్నో?
X
క్రికెట్ చరిత్రల్లో వన్డేల్లో తొలి వికెట్ టేకర్ గా ఖ్యాతి గడించిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి సోదరుడు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించాడని తెలిపాడు.

అలెన్ థామ్సన్ కు కొద్దిరోజుల క్రితం జారి పడడంతో తుంటి గాయానికి చికిత్స జరిగింది. అప్పటి నుంచి పరిస్తితి మెరుగుపడలేదు. ఆఖరికి అలాన్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు.

విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరుఫున ఒక వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచులు మాత్రమే ఆడాడు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించాడు. అదేవిధంగా అతడి బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. క్రికెట్ లో ఇతడిని ముద్దుగా 'ఫ్రాగీ' అని పిలుస్తారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ లో విక్టోరియా తరుఫున 44 మ్యాచ్ లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ వన్డే చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. మెల్‌బోర్న్ టెస్టులో ప్రతికూల వాతావరణం కారణంగా, ఆస్ట్రేలియా - ఇంగ్లండ్‌లు ఎంసీజీ గ్రౌండ్ లో ప్రపంచంలోని మొదటి వన్డేని ఆడాయి .

థామ్సన్ మ్యాచ్‌లో మొదటి వికెట్‌ను తీసుకున్నాడు, అతను ఒక పుల్‌ను మిస్‌క్యూ చేసిన జియోఫ్ బాయ్‌కాట్‌ను ఔట్ చేశాడు. స్క్వేర్ లెగ్ వద్ద బిల్ లారీకి కాల్చాడు. ఆస్ట్రేలియా గెలిచిన 40 ఓవర్ల మ్యాచ్‌లో అతను తన ఎనిమిది ఓవర్లలో 22 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో తొలి వికెట్ అసీస్ కు ప్రాతినిధ్యం వహించిన అలాన్ థామ్సన్ కు దక్కింది. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్ గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.