Begin typing your search above and press return to search.

అందరి దృష్టి రెబల్స్ పైనేనా ?

By:  Tupaki Desk   |   20 March 2023 11:00 PM GMT
అందరి దృష్టి రెబల్స్ పైనేనా ?
X
పద్నాలుగా ఎంఎల్సీ స్ధానాల ఫలితాలు తేలగానే మరో ఎన్నిక టెన్షన్ మొదలైంది. అదే ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఏడు ఎంఎల్సీల ఎన్నిక. నిజానికి ఈ ఎన్నికలో ఎలాంటి టెన్షన్ ఉండాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఏడుస్ధానాలను వైసీపీనే గెలుచుకునే అవకాశముంది. అయితే అనేక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ పంచుమర్తి అనూరాధను పోటీలోకి దింపింది. దాంతో పోటీ అనివార్యమైంది.

ఎప్పుడైతే పోటీ అనివార్యమైందో రెండుపార్టీల్లోను అప్పటినుండే టెన్షన్ మొదలైపోయింది. ప్రతి ఎంఎల్సీకి 22 మంది ఎంఎల్ఏల ఓట్లుపడాలి. ఈ లెక్క వైసీపీలో సరిపోతుంది కానీ టీడీపీకే ఇబ్బంది. ఎందుకంటే టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు పార్టీకి దూరమైపోయారు.

కాబట్టి టీడీపీ బలం ఇపుడు 19 మాత్రమే. టీడీపీ, జనసేనకు దూరమైన ఐదుగురు ఎంఎల్ఏలు ఎలాగూ వైసీపీ అభ్యర్ధులకే ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉన్న బలంతో పంచుమర్తి గెలిచే అవకాశాలు లేవు.

ఇదే సమయంలో వైసీపీలో ఇద్దరు ఎంఎల్ఏలు రెబల్ గా తయారయ్యారు. వీళ్ళ ఓట్లను సంపాదించుకుంటే టీడీపీ బలం 21కి పెరుగుతుంది. అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏల్లో ఒకళ్ళ ఓటును సంపాదించుకున్నా టీడీపీకి 22 ఓట్లు పడతాయి. అప్పుడు మళ్ళీ మొదటి ప్రయారటి ఓట్లని, రెండో ప్రయారిటీ ఓట్లని లెక్కింపు మొత్తం గందరగోళమైపోతుంది. సో టీడీపీకి కావాల్సిన మూడు ఓట్లకోసం తమ్ముళ్ళ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

తమ ఓట్లు క్రాస్ కాకూడదని వైసీపీ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా క్రాస్ ఓటింగ్ చేయించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే రెండుపార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాబట్టి ముందు అందరి దృష్టి రెబల్ ఎంఎల్ఏలపైన పడింది. వీళ్ళు గనుక టీడీపీకి ఓట్లేస్తే పార్టీలో ఒక్కసారిగా ఊపు పెరిగిపోతోంది.

ఇదే సమయంలో వైసీపీకి ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అందుకనే ఇపుడు రెబల్ ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఏమిచేస్తారనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎవరికి ఓట్లేసినా లేదా ఆబ్సెంట్ అయినా కూడా రెబల్స్ కు సమస్యే. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.