ఏపీ అక్రమాలపై తమిళనాడుకు చంద్రబాబు లేఖ

Tue Feb 07 2023 22:04:18 GMT+0530 (India Standard Time)

Chandrababu letter to Tamil Nadu on ap crimes

ఏపీలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్రప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా.. పనికావడం లేదని.. తన వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని..అనుకున్నారో..ఏమో.. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తమిళనాడు సర్కారుకు లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని.. ఆయన కోరారు. ప్రస్తుతం ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో జరుగుతున్న అక్రమాలపై తమిళనాడుకు లేఖ రాయడం కూడా ఇంపార్టెంట్గా మారింది.లేఖలో చంద్రబాబు ఏమన్నారంటే..

తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల నుంచి తమిళనాడుకు కొందరు ఏపీ అధికార పార్టీ నాయకులు బినామీల ముసుగులో గ్రానైట్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.  కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని తెలిపారు.

మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని ఈ గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. కుప్పం నుంచి తమిళనాడు లోని క్రిష్ణగిరి వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని లేఖలో సూచించారు.

శాంతిపురం కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలోని నదిమూర్ ఓ.ఎన్ కొత్తూరు మోట్ల చేను గ్రామాల మీదుగా తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందని దీనిపై ఆధారాలు కూడా సేకరించామని తెలిపారు. ఏపీలోని అధికార పార్టీ నేతల ప్రమేయంతో ఈ అక్రమ రవాణా జరుగుతోందన్నారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.