Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ అదే స‌స్పెన్స్‌.. చంద్ర‌బాబు ఏం చేస్తారు..?

By:  Tupaki Desk   |   29 May 2023 8:00 PM GMT
మ‌ళ్లీ అదే స‌స్పెన్స్‌.. చంద్ర‌బాబు ఏం చేస్తారు..?
X
టీడీపీ ఏటా నిర్వ‌హించే(ఇటీవ‌ల కాలంలో) మ‌హానాడు ముగిసింది. అయితే.. ఈ మ‌హానాడు అత్యంత కీల‌క‌మ‌ని పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించే లా.. పార్టీకి ద‌శ‌,దిశ నిర్దేశించేలా చంద్ర‌బాబు ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారు. దీంతో పార్టీ నాయ‌కు లు.. కార్య‌క‌ర్త‌లుకూడా.. ఈ మ‌హానాడును భారీ స్థాయిలో విజ‌యవంతం చేశారు. అయితే.. ఇక్క‌డ కొన్ని విష‌యాల‌పై చంద్ర‌బాబు స‌స్పెన్స్ కొన‌సాగిస్తున్నారు.

గ‌త కొన్నాళ్లుగా పొత్తుల విష‌యంలోను.. పార్టీ అభ్య‌ర్థుల విష‌యంలోనూ.. నారా చంద్ర‌బాబు నాయుడు.. కొంత స‌స్పెన్స్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని.. కొన్నాళ్లుగా ప్ర‌చారం ఉంది. జన‌సే నాని ప‌వ‌న్ నేరుగా చంద్ర‌బాబును ప‌లుమార్లు క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో ప‌లు విష‌యాలు చ‌ర్చించా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక‌ ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

అయితే.. ఈ విష‌యంలో టీడీపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సంకేతాలు రాలేదు. చంద్ర‌బాబు పెద‌వి విప్పి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని చెప్పింది లేదు.

ఈ నేప‌థ్యంలో మ‌హానాడు వేదిక‌గా.. ఆయ‌న ఈ విష‌యంపై తేల్చేస్తార‌ని.. పార్టీ సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు అంద‌రూ ఆశ‌గా ఎదురు చూశారు. కానీ, ఈ పొత్తుల విష‌యాన్ని ఏ ఒక్క నాయ‌కుడు కూడా ప్ర‌స్తావించ‌కుండానే మ‌హానాడు ముగిసింది.

మ‌రో కీల‌క విష‌యం.. రాష్ట్రాన్ని అప్పుల నుంచి బ‌య‌ట ప‌డేయ‌డం. ఈ విష‌యంపై స్వ‌యంగా చంద్రబా బే ప‌లు మార్లు ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ హ‌యాంలో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారిపోయింద‌ని.. ఇన్నిన్ని అప్పులు చేస్తున్నార‌ని ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు.

అయితే.. ఈ అప్పుల‌ను తాను అధికారంలోకి వ‌చ్చాక ప‌ఠాపంచ‌లు చేస్తాన‌ని కూడా చెప్పారు. దీంతో మ‌హానాడులో ఈ విష‌యం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నా.. దీనిపైనా చంద్ర‌బాబు స‌స్పెన్స్ కొన‌సాగించారు.