బాలకృష్ణకు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్.. తారకరత్న పరిస్థితి ఆరా

Fri Jan 27 2023 16:17:58 GMT+0530 (India Standard Time)

Chandrababu, Jr NTR Called Balakrishna About Tarak Ratna Health

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో  పాల్గొని సొమ్మసిల్లి పడిపోయిన నందమూరి హీరో ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు యంగ్ హీరో నందమూరి తారకరామారావు ఆరాతీశారు.  లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.



వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు.తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అనే అనుమానంతో వైద్యులు మొదట సీపీఆర్ చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని తేలింది. కార్డియాలజిస్ట్ గుండెపోటు అని తేల్చడంతో కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందసి్తున్నారు. టీడీపీ నేత హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరాతీస్తున్నారు. 10 నిమిషాలకు ఒకసారి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు.  కుప్పం ఆస్పత్రి వైద్యులతోనూ చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. అవసరమైన వైద్యం అందించాలని కోరారు.

తారకరత్న సోదరుడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం గుండెపోటుకు గురైన తారకరత్న ఆరోగ్యంపై ఆరాతీశారు. తన బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్యంపై ఆరాతీశారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని.. ఆయన కోలుకుంటున్నట్లుగా బాలయ్య ఫోన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్తితిపై బాలయ్య మీడియాతో మాట్లాడారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తున్నామన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యిందని.. మిగిలిన అన్ని రిపోర్టులు బాగున్నాయని బాలకృష్ణ తెలిపారు.

తొలుత తారకరత్నను కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ వైద్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించాలని సూచించారు. బాలకృష్ణ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకున్నారు.  బాలయ్య ఆధ్వర్యంలో తారకరత్నను అంబులెన్స్ లో వైద్య సదుపాయం మధ్య తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.