Begin typing your search above and press return to search.

జగన్ పరువు నిలువునా తీసేసిన బాబు

By:  Tupaki Desk   |   29 March 2023 9:19 PM GMT
జగన్ పరువు  నిలువునా  తీసేసిన బాబు
X
తెలంగాణాలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలుగుదేశం పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఏపీ మీదకు సబ్జెక్ట్ మళ్లించారు.

అంతే ఏపీను చూస్తే బాధ కలుగుతోంది. జాలి వేస్తుంది. అక్కడ అభివృద్ధి లేదు, సైకో పాలన సాగుతోంది, అక్కడ అధికారంలో ఉన్న వారిని ఏమనాలి. విద్వంశ కారుడా, పనికి మాలిన దద్దమా, చేతకాని వాడనాలా ఏమనాలి అని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఏపీని సర్వనాశనం చేయడానికే పుట్టాడని ఘాటైన పదజాలం ఉపయోగించారు. అభివృద్ధి లేకుండా చేశారు. ఏపీలో ఎటు చూసినా వేదనా రోదనా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. విభజన కంటే కూడా అధిక నష్టాన్ని ఏపీకి చేకూర్చారు జగన్ అని చంద్రబాబు మీద విమర్శించారు. ఏపీని మూడున్నర దశాబ్దాల వెనక్కి నెట్టివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో రైతులంతా కలసి ముప్పయి మూడు వేల ఎకరాలను ఇస్తే దానికి ఏదో సాకులు చెప్పి అమరావతి రాజధాని లేకుండా చేశారని నిందించారు. కూల్చివేతల ప్రభుత్వం జగన్ ది అని అన్నారు. ఏపీ ఈ రకంగా అయింది అంటే ఒక్క ఆంధ్రులే కాదు, తెలంగాణా సహా తెలుగు జనాలు ఎక్కడ ఉన్నా కూడా బాధపడాలని ఆయన అన్నారు

ఏపీలో మార్పు వస్తోందని, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం గెలుచుకుందని, అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటుని గెలుచుకుందని గుర్తు చేశారు. చదువుకున్న వారు వైసీపీని వద్దు అనుకున్నారని, రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు. తాను ఆంధ్రా పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పాటుపడుతుదని, పూర్వ వైభవం తీసుకుని వస్తామని అన్నారు. పులివెందులలో గన్ కల్చర్ ని తీసుకువచ్చిన ఘనత జగన్ దే అని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే తాను తెలంగాణాలో చేసిన అభివృద్ధిని ప్రస్తుతం సీఎం కేసీయార్ కొనసాగించడం అభినందనీయం అన్నారు. అందుకోసం కేసీయార్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు. తెలంగాణలో బీయారెస్ మీద ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు, తెలంగాణా అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని, పేదలు లేని దేశంగా చూడాలన్నదే తన కోరిక అని ఆయన అన్నారు.

ఏది ఏమైనా తెలంగాణా గడ్డ మీద జగన్ కి తిట్ల వర్షం కురిసింది. మరి దీని మీద వైసీపీ నేతలు గట్టి రిటార్టు ఇస్తారా లేదా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ పరువుని తెలంగాణా గడ్డ మీద బాబు నిలువునా తీసేసారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.