Begin typing your search above and press return to search.

అమరావతి దగ్గర ఫిక్స్ అయిన బాబు... జనం మూడ్ చూసేనా...?

By:  Tupaki Desk   |   9 Jun 2023 10:12 PM GMT
అమరావతి దగ్గర ఫిక్స్ అయిన బాబు... జనం మూడ్ చూసేనా...?
X
అమరావరి రాజధాని. ఎన్నికల ఏడాది లో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడికే వచ్చి ఆగారు. నిజాని కి అమరావతి రాజధాని చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్. అమరావతి ని ప్రపంచ రాజధా ని చేయాలనుకున్నారు. అక్కద నవ నగరాలనే నిర్మించాలనుకున్నారు. కేంద్రం ఇటీవల దేశం లో కొత్త నగరాల ని నిర్మించాలని అనుకుంటోంది. కానీ ఇప్పటికి ఎనిమిదేళ్ళ క్రితమే బాబు ఆ ఆలోచన చేశారు.

ఏకంగా యాభై వేల ఎకరాల భూములల్లో అమరావతి ఒక భూతల స్వర్గంగా తీర్చిదిద్దాల్నై భారీ కాన్వాస్ మీద బొమ్మ గీశారు. ఇది బాహు బలి లాంటి పాన్ వరల్డ్ బడ్జెట్ మూవీ. దాని కి కాలం నిధులూ రెండూ పెద్ద ఎత్తున ఖర్చు అవుతాయి. దశల వారీ గా నిర్మాణం అనుకున్నా మరో పాతికేళ్ళు పట్టవచ్చు. అయినా పోయిందేమీ లేదు. ముందు ఒక దశను పూర్తి చేసి కొంత షేప్ ఇస్తే జనాల కు నమ్మకం కలిగేది.

కానీ దేని కీ ఒక పట్టాన సంతృప్తి చెందని చంద్రబాబు వ్యవహారం వల్లనే అమరావతి కధ 2019 నాటి కి కూడా గ్రాఫిక్స్ స్టేజి లోనే ఉండిపోయింది. పైగా విభజన ఏపీ లో ఏ ఇతర ప్రాంతాలు కూడా డెవలప్ కాకుండా ఒక్క అమరావతి మీదనే లక్షల కోట్లు పెడతారా అంటూ వైసీపీ సంధించిన నినాదం కూడా బాగా పనిచేసింది. అమరావతి రియల్ దందా అని భూముల రేట్లు పెంచడం కోసమే అన్న వైసీపీ ప్రచారం కూడా దెబ్బ కొట్టింది.

అందుకే అమరావతి రాజధాని పరిధి లోనే టీడీపీ ఘోరంగా ఓడింది. ఇదిలా ఉంటే జగన్ వచ్చాక అమరావతి ని తొక్కి పెట్టారు. ఎక్వైరీ వేశారు. అదిపుడు సుప్రీం కోర్టు అనుమతి తో ఇన్వెస్టిగేషన్ దాకా వచ్చింది. ఇక అమరావతి రాజధాని ని మూడు ముక్కలు చేసి విశాఖ ను పాలనా రాజధాని అన్నారు. కర్నూల్ లో న్యాయ రాజధాని అన్నారు. జగన్ పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ పాటికి ఆయన అనుకున్న మూడు రాజధానులు కార్యరూపం దాల్చేదే.

కానీ రాజకీయం కోసం, జనాల ను, ప్రాంతాల ను అట్రాక్ట్ చేయడం కోసం అన్నట్లుగా రాజధానులు అన్న ట్యాగ్ తగిలించడం వల్లనే వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు న్యాయ సమీక్ష లో వీగిపోయింది. ఇపుడు హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ తీర్పు వచ్దే లో గానే ఎన్నికలు వచ్చేలాగా ఉన్నాయి. సో జగన్ మూడు రాజధానుల మీద రాయలసీమ లోనూ విశాఖ లోనూ స్టార్టింగ్ లో మోజు ఉన్నా ఇపుడు మాత్రం ఎవరి కీ ఆసక్తి పెద్దగా కనిపినిచడంలేదు.

సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని చంద్రబాబు ఇన్నాళ్ళ కు ఓపెన్ గా అమరావతి మన రాజధాని జస్ట్ తొమ్మిది నెలలు ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా అక్కడ అద్భుత రాజధాని కట్టి స్వర్గం చేసి చూపిస్తాను అని టీడీపీ ఐటీ సదస్సులో గర్జించారు. బాబు మాత్రమే కాదు లోకేష్ కూడా రాయలసీమ నడి బొడ్డు మీద హై కోర్టు కాదు, కర్నూల్ కి హై కోర్ట్ బెంచ్ ని టీడీపీ అధికారం లోకి వచ్చాక ఇస్తామని చెప్పినా వ్యతిరేకత పెద్దగా రాలేదు.

అంటే జనాల మూడ్ చేంజి అయింది అని టీడీపీ గ్రహించింది. దీని కంటే ముందు చంద్రబాబు విశాఖ టూర్ లో జై అమరావతి అనిపించారు. విశాఖ ను ఆర్ధిక రాజధాని అన్నారు మొత్తానికి చూస్తే అమరావతి ట్రంప్ కార్డు తో టీడీపీ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోతోంది. ఎన్నికల్లో ఇది బ్రహ్మాస్త్రంగా చేయనుంది.

దాని కి విరుగుడుగా జగన్ వద్ద ఉంది మూడు రాజధానుల ప్లాన్ మాత్రమే. అది వర్కౌట్ కాదని తేలిపోయిన వేళ వైసీపీ ఏం చేయబోతోంది అమరావతి నినాదాన్ని ఎలా అడ్డుకుంటుంది అన్నది చూడాలి. ఇక ఒక్క మాట లో చెప్పాలీ అంటే టోటల్ ఏపీ జనాల మూడ్ మాత్రం మనకంటూ ఒక రాజధాని ఉంటే బాగుండు అన్న స్టేజికి వచ్చేసింది. ఇదే ఇపుడు టీడీపీ కి భారీ అడ్వాంటేజ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.