Begin typing your search above and press return to search.

వరాల మూట విప్పిన బాబు... ప్రతీ ఇంటికీ డబ్బులే డబ్బులు?

By:  Tupaki Desk   |   28 May 2023 10:15 PM GMT
వరాల మూట విప్పిన బాబు... ప్రతీ ఇంటికీ డబ్బులే డబ్బులు?
X
వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ మ్యానిఫేస్టోలో రిలీజ్ చేసింది. రాజమండ్రిలో మహానాడు ముగింపు కార్యక్రమంలో టీడీపీ మొదటి విడతగా ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేసింది. మహిళాశక్తి పేరుతో ఆడబిడ్డకు నిధి అంటూ ఒక్కో ఆడబిడ్డకు నెలకు పదిహేను వందలు, ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తాం అని చంద్రబాబు ప్రకటించారు.

ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తుంది. అయిదు ఏళ్ళలో తొంబై వేల రూపాయలు ఆడబిడ్డకు పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి ప్రతీ బిడ్డకు పదిహేను వేలు ఇస్తాం. ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా ఎంత మంది ఉన్నా డబ్బులు ఇంటికి ఇస్తామని అమ్మ ఒడి పధకానికి బదులుగా దీన్ని బాబు ప్రకటించారు.

స్థానిక సంస్థలలో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు హక్కు కల్పిస్తాం, అలా చట్టాన్ని సవరిస్తామని బాబు చెప్పారు. ఏడాదికి మూడు సిలెండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని బాబు మరో వరాన్ని ప్రకటించారు. ఆడబిడ్డలు ఇక మీదట ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు అని హామీ ఇచ్చారు.

మహిళల మీద గురి పెట్టి మరీ స్టడీ చేసి ఈ హామీలు ఇచ్చారు చంద్రబాబు. ఇక యువగళం అంటూ యువతకు కూడా అనేక పధకాలు ప్రకటించారు. రాబోయే అయిదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదే అని చెప్పారు. ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు మరో హామీ ఇచ్చారు.

ఏపీలో ఆధునిక నగరాన్ని తయారు చేద్దామనుకున్నాను. దాన్ని నాశనం చేద్దామని జగన్ చూశాడని ఆయన అన్నారు. యువతకు భవిష్యత్తు కావాలని అది తాను ఇస్తామని బాబు చెప్పారు. అన్న దాత పేరుతో రైతులకు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ఈ ఇరవై వేలే కాకుండా వ్యవసాయం లాభసాటిగా ఉండడానికి రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి కూడా చేస్తామని చెప్పారు.

ఇక ఇంటింటికీ తాగు నీరు ఇస్తామని మరో హామీ ప్రకటించారు. మంచి నీరు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. అందుకే ఒక నిర్దిహ్స్టమైన కార్యక్రమంతో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. బీసీలకు రక్షణగా చట్టాన్ని తీసుకుని వస్తామని కూడా బాబు మరో హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకు బీసీలు వెన్నెముక అని ఆయన అన్నారు. దీని కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

బీసీల జీవితాలతో ఎవరైనా ఆడుకోకుండా ప్రత్యేక చట్టం తీసుకుని వస్తామని అన్నారు. బీసీలకు ఇంకా మేలు చేస్తామని ఆయన వెల్లడించారు. పేదల గొప్పల మధ్య అంతరాన్ని తగ్గించి పేదలను ధనికులను చేస్తామని చెప్పారు. పూర్ టూ రిచ్ అన్న పధకాన్ని తీసుకుని వస్తామని, అంతా ధనికులే అవుతారు అని ఆయన చెప్పారు. మొత్తానికి నగదు బదిలీ స్కీం కి బాబు జై కొట్టేశారు.