Begin typing your search above and press return to search.

మూడు సార్లు చచ్చి బతికి.. ప్రముఖుల్ని కలిసిన ఆత్మ?

By:  Tupaki Desk   |   3 Jun 2023 6:00 AM GMT
మూడు సార్లు చచ్చి బతికి.. ప్రముఖుల్ని కలిసిన ఆత్మ?
X
ఓ మహిళ నెలలో మూడు సార్లు చనిపోయింది అంట. అంతే కాదు.. ఆత్మగా మారి ప్రముఖులను కలిసింది అంట. అదేంటి అనుకుంటున్నారా... అసలు ఎవరైనా వారి జీవితంలో ఒకేసారి చనిపోతారు కదా అనుకుంటున్నారా... అయిన ఒకసారి చచ్చిపోయిన మనిషి మళ్లీ బతకడం అసాధ్యం ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా... అవునండీ చచ్చిన మనిషి బతికి అయితే రాలేదు.

కానీ ఓ మహిళ తాను నెలలో మూడు సార్లు చనిపోయాను అంటోంది. అంతేనా.. ఆత్మగా మారి దేవుడిని, ప్రముఖుల్ని కలిశాను అంటోంది. అయితే ఈ ఘటన మన దగ్గర జరగలేదు. ఇంగ్లాండ్లో చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన 57 ఏళ్ల మహిళ బీవెర్లీ గిల్ మర్ ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆమెకు 20 ఏళ్లు ఉన్నపుడు బ్రెయిన్‌ ట్రోమా వచ్చిందట. దీంతో ఆమె చనిపోయిన ఫీల్ ను కలిగింది అంట.

ఆ సమయంలో ఆమె గుండె కొట్టుకోవటం ఆగిపోయి... శరీరం మెల్లగా పని చేయకుండా పోయిందని చెప్పుకోచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె ఆత్మ శరీరంనుంచి బయటకు వచ్చిందంట. ఆ ఆత్మ శూన్యంలోని మరికొన్ని ఆత్మలతో కలిసి... ఈ నేపథ్యంలోనే ఆమె వాల్ట్‌ డిస్నీ కంపెనీ అధినేత వాల్ట్‌ డిస్నీని కలిశానని చెప్పుకొచ్చింది.. ఆయన ఆమెతో చాలా కథలు చెప్పాడని చెప్తోంది. వాల్ట్‌ డిస్నీ ఉండే ప్రదేశంలో ఓ అద్భుతమైన కట్టడం ఉంది.

చెక్కతో చేసిన అది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఆమె కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత వాల్ట్‌ డిస్నీ చెప్పిన వాటన్నింటినీ రాసేది. బొమ్మల్ని కూడా గీసేది. బీవెర్లీ ఆత్మగా మారినపుడు తన తండ్రిని కూడా చూసిందని చెప్పుకుంటుంది. మొదటి సారి ఆమె అతడ్ని కలిసినపుడు ఆయన వయసు 52 ఏళ్లలాగా అనిపించారట. ఎందుకంటే అతడు ఆ వయసులోనే చనిపోయాడు. రెండో సారి చూసినపుడు మాత్రం 30 ఏళ్లలాగా కనిపించాడని అంటోంది.

తన కూతుర్ని చూసిన ఆనందంలో ఆయన ఎంతో సంతోషంగా కనిపించాడని చెప్తోంది ఇలా ఆమె చనిపోయిన ప్రతీసారి ఎవరో ఒక ప్రముఖుడ్ని చూస్తూ ఉంది. జీసస్‌ను కూడా ఆమె కలిసిందని చెప్తోంది. ఆయనతో స్నేహం కూడా చేసిందట. మరి, నెలలో మూడుసార్లు చనిపోయానంటున్న బీవెర్లీ చెప్పే మాటలు ఎంత వరకు నిజం అనేది తెలియదు.