Begin typing your search above and press return to search.

సత్యకుమార్ మీద దాడి....ఢిల్లీ ఈక్వేషన్స్ మారుతాయా...?

By:  Tupaki Desk   |   1 April 2023 5:00 AM GMT
సత్యకుమార్ మీద దాడి....ఢిల్లీ ఈక్వేషన్స్ మారుతాయా...?
X
బీజేపీలో సీనియర్ నేత సత్యకుమార్. ఆయన అంటే ఢిల్లీ పెద్దలకు గురి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అనుచరుడుగా బీజేపీ రాజకీయాల్లో ఆయన కీలకంగా ఉంటున్నారు. ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన సత్యకుమార్ యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో తన వంతు పాత్ర వహించారు.

నేరుగా ప్రధాని అమిత్ షాలతో మాట్లాడగలిగే అతి కొద్ది మంది నేతలలో ఆయన ఒకరు. ఏపీకి సంబంధించి బీజేపీకి కళ్ళూ ముక్కూ చెవి ఆయనే. అలాంటి సత్యకుమార్ అమరావతి రాజధాని ఉద్యమ రైతులకు సంఘీభావం ప్రకటించడానికి వెళ్తూంటే ఆయన కారు మీద దాడి జరిగింది. ఇది వైసీపీ వారి పనే అని ఆయన ఆరోపించారు.

దీని మీద కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పారు. జగన్ ప్రభుత్వం విషయం అమిత్ షా చూసుకుంటారని వార్నింగ్ ఇచ్చేశారు. ఇక ఇప్పటిదాకా బీజేపీకి మిత్రుడుగా ఉన్నా పెద్దగా ఏ విషయంలో నోరు మెదపని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సత్యకుమార్ మీద దాడిని సీరియస్ గా తీసుకోవాల్సిందే అని అంటున్నారు

దీని మీద కేంద్ర పెద్దలు దృష్టి సారించాలని సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. పొరుగున ఉన్న తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అయితే వైసీపీ గూడాలు అంటూ ఏపీ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేశారు. మొత్తంగా చూస్తూంటే ఈ ఇష్యూ తేలికగా తీసుకునే అవకాశాలు అయితే కనిపించడంలేదు.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు ఇచ్చింది. దాంతో ఇపుడు ఏమి జరుగుతుంది అన్నదే చర్చ గా ఉంది. నిజానికి కేంద్రంతో సన్నిహిత సంబంధాలను జగన్ జాగ్రత్తగా నెరుపుకుంటూ వస్తున్నారు. ఇక ఈ టైం లో కేంద్ర సాయం వైసీపీకి చాలా అవసరంగా ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అనుకుంటే కేంద్రం నుంచి అనుకూలంగా అంతా జరగాలి.

మరి ఇన్ని తెలిసి ఇంతలా కధను నడుపుకుని వస్తున్న టైం లో వైసీపీ గూండాలు అంటూ విపక్షాలు మరింత గట్టిగా అటాక్ చేయడం ఏపీలో విపక్షాలను పూర్తిగా కలపడానికి కూడా ఈ ఇష్యూ ఇంకా ఉపయోగపడుతోందా అన్న చర్చ వస్తోంది.

ఇంకో వైపు చూస్తే అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు తిరుపతి టూర్ కి వచ్చిన అమిత్ షా కారు మీద దాడి జరిగింది. దాన్ని బీజేపీ పెద్దలు ఇప్పటికీ మరచిపోలేదు. ఇపుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కారు మీద దాడి జరగడాన్ని బీజేపీ పెద్దలు సీరియస్ గానే తీసుకుంటారు అని అంటున్నారు.

అదే కనుక జరిగితే వైసీపీ సూప్ లో పడినట్లే అని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి రోజులు బాలేవా అన్న చర్చ వస్తోంది. లేకపోతే అమరావతి ఉద్యమానికి ఎంతో మంది ఎన్నో సార్లు మద్దతు తెలిపారు. బీజేపీ నుంచి సత్యకుమార్ వచ్చి మద్దతు తెలిపి వెళ్ళిపోతే ఏమి పోయింది అన్న చర్చ వస్తోంది.

అయితే ఈ విషయంలో పోలీసుల వెర్షన్ వేరుగా ఉంది. అమరావతిలో మూడు రాజధానులు కావాలంటూ బహుజన పరిరక్షణ సమితికి చెందిన వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అక్కడకు వచ్చిన సత్యకుమార్ అనుచరులు వారి మీద దాడి చేశారని అలా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని దాన్ని అదుపులోకి తెచ్చామని అంటున్నారు.

సత్యకుమార్ కారు మీద దాడి జరగలేదు అని పోలీసులు అంటున్నారు. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మీద కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బహుజన పరిరక్షణ సమితి వెనక వైసీపీ వారు ఉన్నారని, ఇది వారి దాడే అని బీజేపీ వారు అంటున్నారు.

ఏది ఏమైనా కేంద్ర బీజేపీకి వైసీపీకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇపుడు ఈ దాడి వెనక ఏముందో ఎవరు చేయించారో తెలియదు కానీ బీజేపీకి వైసీపీకి రిలేషన్స్ దెబ్బ తినేలా కధ సాగుతుందా అన్నదే చర్చట. ఏది ఏమైనా సత్యకుమార్ దీన్ని ఎలా ఢిల్లీ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.