Begin typing your search above and press return to search.

స్కీం స్కాం.. బాబు... ఏం జరగబోతోంది....?

By:  Tupaki Desk   |   20 March 2023 7:28 PM GMT
స్కీం స్కాం.. బాబు... ఏం జరగబోతోంది....?
X
ఏపీ రాజకీయాలు పీక్స్ చేరుకుంటున్నాయి. అటు చంద్రబాబు ఇటు జగన్ అంతే ఈ మధ్యలో ఎవరూ లేరు అన్నట్లుగానే దూకుడుగా రాజకీయం సాగుతోంది. ఇలా వ్యక్తిస్వామ్య రాజకీయాలు రాజ్యమేలుతున్న టైంలో ప్రజాస్వామ్యం గురించి చెప్పుకోవడం ఆలోచించడం కూడా అనవసరం అన్న మాట వినిపిస్తోంది.

ఏపీలో వైసీపీకి పట్టభద్రుల ఎన్నికల్లో ఒక గట్టి దెబ్బ తగిలింది.అది నిరుద్యోగులు అనబడే యువజనుల నుంచి అది వచ్చి పడింది. ఇక ఏపీలో యువత అంతా మా వైపే అని టీడీపీ జబ్బలు చరుస్తున్న క్రమంలో అసెంబ్లీ వేదికగా యూత్ టార్గెట్ గా జగన్ ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు మొదలెట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో అతి పెద్ద స్కాం ఉందని జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

ఇంతటి స్కాం చేయడం చంద్రబాబుకు తప్ప మరోకరి వల్ల కాదని జగన్ తేల్చేశారు. అసలు ఇలాంటి స్కిల్స్ అన్నీ బాబుకే ఉన్నాయని కామెంట్స్ చేశారు. సీమెన్స్ కంపెనీ అని పేరుకు చెప్పి అందులో ఉన్న ఒకరితో ఒప్పదం చేసుకుని మొత్తం నిధులను గోల్ మాల్ చేశారని జగన్ ఆరోపించారు. ఇంతటి స్కాం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన నిలదీశారు.

అసలు ఎవరికీ అర్ధం కాని విషయం ఏంటి అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్కడైనా ప్రభుత్వానికి గ్రాంట్స్ రూపంలో నిధులు ఇస్తుందా అని జగన్ ప్రశ్నించారు. మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందులో తొంబై శాతం సదరు సీమెన్స్ కంపెనీ భరిస్తుందని పేర్కొన్నారని, మిగిలిన పది శాతమే ప్రభుత్వం చెల్లించాలి అంటూ అక్షరాలా 371 కోట్ల రూపాయలను సీమెన్స్ పేరిట మళ్ళించారని ఆరోపించారు

ఆ నిధులు అన్నీ కూడా ఎటు వైపు వెళ్లాయో అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇలా బటన్ నొక్కి అలా తన ఖాతాలోకి నిధులను మళ్ళించుకున్నారని జగన్ సెటైర్లు వేశారు. తాను పేదల కోసం బటన్ నొక్కితే బాబు తన స్వప్రయోజనాల కోసమే ఇలాంటి స్కాములకు తెర లేపారని జగన్ ఘాటైన కామెంట్స్ చేశారు. ఏపీలో యువతను ఈ విధంగా నిలువునా ముంచారని ఆయన అన్నారు.

దీని వెనక అసలు ఉద్దేశ్యం ఏంటి అంటే ఏపీలో యువత ఇపుడు ప్రభుత్వం మీద మంచి కసి మీద ఉన్నారు. వారిని తమ వైపు మళ్ళిచుకోవడానికి వైసీపీ సడెన్ గా ఈ అంశాని తెర మీదకు తెచ్చిందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికే సీఐడీ ఈ అంశం మీద విచారణ జరుపుతోంది. తొందరలో ఈ కేసులో కీలకమైన వ్యక్తుల అరెస్టులు ఉంటాయన చర్చ కూడా వస్తోంది.

ఈ నేపధ్యంలో జగన్ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబే అసలు ముద్దాయి అని చెప్పడం అంటే బాబుని యూత్ లో దోషిగా నిలబెడతారా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. ఏపీలో అయిదేళ్ళ టీడీపీ ప్రభుత్వంలోనూ యువతకు పెద్దగా చేసిందేమీ లేదు ఆ కసితోనే జగన్ కి వారు 2019లో ఓట్లేసి గెలిపించారు. నాలుగేళ్ల జగన్ ఏలుబడిలోనూ వారికి నిరాశ ఎదురైంది. దాంతో తిరిగి టీడీపీ వైపుగా వచ్చారు. మరి యువత అంతా మండిపోతున్న వేళ వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఏమైనా పధకాలను తీసుకువస్తే బాగుంటుంది అన్న చర్చ ఉంది.

అయితే ఎదురుదాడికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందా అన్నదే ఇక్కడ చూడాల్సి ఉంది. టీడీపీ హయాంలో యువతను బాబు మోసం చేశారు అని జగన్ చెబితే వైసీపీ వైపు యూత్ వస్తారా అన్నది పెద్ద ప్రశ్న. అయితే ఇప్పటికిపుడు యూత్ కి ఏమి చేయాలో ప్రభుత్వానికి పార్టీకి కూడా తోచడం లేదు. ఒకవేళ ఏమి అనుకున్నా వాటి ఫలితాలు వచ్చేలోగా ఎన్నికలు వస్తాయి.

అందుకే ముందు బాబునే బదనాం చేస్తే పోలా అన్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే వైసీపీ ఇపుడు ఓటమి కసితో ఉంది. దాంతో ఇప్పటిదాకా నడుస్తున్న ఈ కేసులో రేపో మాపో సంచలన విషయాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.