Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు-ఉచితాలు-మినీ మేనిఫెస్టో.. మేధావుల మాటిదే!

By:  Tupaki Desk   |   30 May 2023 11:00 PM GMT
చంద్ర‌బాబు-ఉచితాలు-మినీ మేనిఫెస్టో.. మేధావుల మాటిదే!
X
మేధావులు, రాజకీయ నాయకులు సహా అందరిలోనూ ఇప్పుడు పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక విజనున్న నాయకుడు నుంచి `ఉచితాల‌` మాట ఏంటి అని చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనగానే విజన్ ఉన్న నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రం ఇతర రాష్ట్రాలు దేశ సరిహద్దుల‌లో సైతం ఆయన విజనున్న నాయకుడుగానే పేరుపేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఉచితాలకు తను వ్యతిరేకం అని గతంలో ప్రధానమంత్రి మోడీకి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో ఉచితాలు ఉండాలి కానీ మరి మితిమీరినటువంటి ఉచితాలు ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసేటటువంటి ఉచితాలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబునాయుడు నోటి నుంచి ఉచిత వాగ్దానాలు రావడం కచ్చితంగా ఆయన అమలు చేస్తాను ఎలాంటి ప‌రిమితులు పెట్టకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులకీ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఉచితాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఎంత ఉచితలకు వ్యతిరేకం అని చెప్పుకునేటువంటి బిజెపి నాయకులు కూడా ఇటీవల జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో అనేక ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు.

కేజీ నుంచి పీజీ విద్య వరకు ఉచితంగా ఇస్తామని మహిళలకు మోటార్ సైకిల్ ఇస్తామని మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాల్లో అవకాశం కల్పిస్తామని అదేవిధంగా ఉచితంగా పాలు ప్యాకెట్లు 6 లీటర్ చొప్పున నందిని పాల ప్యాకెట్లు ఉచితంగా ఇస్తామని బిజెపి ప్రకటించింది. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అంటే దీనిబట్టి ఒకరకంగా చెప్పాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలే ఉచితలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పార్టీని ఓడించాలి తాము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అంటే చంద్రబాబు ముందు ఈ ఉచిత హామీలు తప్ప మరో మార్గం ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి.

అభివృద్ధి అనే మాట వాస్తవమే అభివృద్ధి జరిగి తేరాల్సిందే అయితే ఇది పట్టణ ఓటర్లలో మాత్రమే బలంగా ఉంది. గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు తీసినట్లైతే వాళ్లకి రాజధానితో అవసరం లేదు. అభివృద్ధి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఇంటింటికి వచ్చి పింఛ‌న్లు ఇవ్వడం. నెలనెలా ఇంటింటికి రేషన్ వచ్చేయడం. అలాగే తమకు అందుతున్న పథకాలు డబ్బులు సక్రమంగా ఇవ్వటం మాత్రమే కోరుకుంటున్నారు. ఇది నిష్టర‌ సత్యం. దీన్ని కూడా చంద్రబాబు అంగీకరించక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. రాజకీయాల్లో అందుకే తప్పని పరిస్థితుల్లో కాలానికి అనుగుణ చంద్రబాబు నాయుడు మారారని చెప్పాలి.

ఇదే విషయాన్ని గత కొన్ని నెల‌లుగా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి వారు కూడా చెబుతున్నారు. కాలానికి అనుగుణంగా మీరు మారాలి సార్ అని అనేకమంది ఆయనకు సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. నిజానికి చంద్రబాబు మనస్ఫూర్తిగా ఇటువంటి భారీ స్థాయి పథకాలకు, ఉచితాలకు వ్యతిరేక‌మే అయినప్పటికీ కూడా కాలానికి అనుగుణంగా ఒక బలమైనటువంటి వ్యక్తిని ఢీకొనాలి అన్నప్పుడు అంతే బలంగా మనం కూడా ముందుకు సాగాలి అనేటటువంటి సూత్రం ఏదైతే ఉందో అది యుద్ధనీతి. ఇప్పుడు బలమైనటువంటి చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కూడా అంతే బలంగా ఎలాగైతే పోరాడుతుందో అదే విధంగా బలమైనటువంటి వైసీపీ నేతలని బలమైనటువంటి వ్యూహాల్ని ఢీకొనాలి అంటే అంతే బలమైనటువంటి వ్యూహాలతో చంద్రబాబు నాయుడు అడుగులు వేశారు.

అంతే తప్ప ఇందులో ఆయన విజ‌న్‌ను ఎక్క‌డా దాచుకోలేదు. ఆయన ఎక్కడా తనను హ‌న‌నం చేసుకోలేదు అనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు ప్రకటించింది కేవలం మినీ మేనిఫెస్టో మాత్రమే. దీన్ని చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేసి చంద్రబాబు నాయుడుకి విజన్ అయిపోయింది అని, మేనిఫెస్టోని ఫైనల్ అని చంద్రబాబు నాయుడు విజన్ వదిలేసారని చేస్తున్నటువంటి విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు విజన్ ఎప్పుడూ కూడా అభివృద్ధి, ఉపాధి కల్పన ప్రతి వ్య‌క్తినీ ఆర్థికంగా ఉపయోగించుకుని మరింత ఆర్థికంగా ఎదగడం శ్రామిక శక్తిని యువశక్తిని ఉపయోగించుకోవడం వంటి కీలకమైనటువంటి అంశాలు దిశగా ఆయనకి ఎప్పుడు దృష్టి పెట్టారు.

అదే కొనసాగుతుంది అదే కొనసాగిస్తారు అని టిడిపిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి పెద్దపీటు వేయటం పరిశ్రమలు తీసుకురావడం ప్రోత్సహించటం ఇవి ప్రధానంగా వచ్చేటటువంటి పూర్తిస్థాయి మేనిఫెస్టోలో పెద్ద పేట వేస్తారని అప్పుడు ఇవన్నీ తేలిక అవుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.