Begin typing your search above and press return to search.

కృత్రిమ మేధ ఎంత డేంజరో తెలిస్తే వణుకు పుట్టటం ఖాయం

By:  Tupaki Desk   |   7 Jun 2023 10:26 AM GMT
కృత్రిమ మేధ ఎంత డేంజరో తెలిస్తే వణుకు పుట్టటం ఖాయం
X
కృత్రిమ మేధ.. పొట్టిగా చెప్పాలంటే ఏఐ. యూత్ లో ఏ ఇద్దరు కలిసినా వారి మాటల్లో తప్పనిసరిగా వచ్చే మాటగా దీన్ని చెప్పాలి. మొదట్లో ఏఐ గురించి ఫ్యాన్సీగా చెప్పుకోవటం.. దానితో కలిగే మేలు.. లాభాల గురించి మాట్లాడుతూ.. దాని మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్న వేళలో.. ఇప్పుడు ఆ సాంకేతికతో కలిగే ఇబ్బందులు.. ఎదురయ్యే సమస్యలు.. వచ్చి పడే ముప్పు గురించి తెలిస్తే.. వణుకు పుట్టటమే కాదు.. ఈ టెక్నాలజీని కనుక్కొని ఉండకపోతే బాగుండేది కదా? అన్న భావన కలుగక మానదు.

తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు ప్రధాన సలహాదారుగా వ్యవహరించే మ్యాట్ క్లిఫర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ తీవ్రత మనుషుల మీద ఎంత ఉంటుందన్న విషయాన్ని ఆయన వివరిస్తూ షాకిచ్చారు. ఆయన మాటల్ని విన్న తర్వాత.. ఏఐ అన్నంతనే వణికేలా ఆయన మాటలు ఉన్నాయి.

కృత్రిమ మేధను నియంత్రించకుంటే వచ్చే రెండేళ్లలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొనక తప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే ఏఐ.. విస్తరిస్తున్న వైనంపై అంతర్జాతీయ ప్రముఖులు.. సాంకేతిక నిపుణులు దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వివిధ వేదికల మీద చెప్పటం తెలిసిందే.

తాజాగా మ్యాట్ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు తీసే సైబర్.. బయోలాజికల్ ఆయుధాల్ని క్రియేట్ చసే సామర్థ్యంకృత్రిమ మేధకు ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయస్థాయిలో దీన్ని నియంత్రించకపోతే.. మనిషి కంట్రోల్ చేయలేని శక్తివంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారి తీస్తాయని చెబుతున్నారు. జీవాయుధాలు.. భారీ సైబర్ దాడులు చేసేందుకు అవసరమైన సాంకేతికతతో ఏఐను వాడుకునే వీలుందన్నారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు సాంకేతిక సలహాదారుగా వ్యవమరించే ఆయన.. చాట్ జీపీటీ.. గూగుల్ బార్డ్ లాంటి ఏఐ మోడల్స్ పై పరిశోధన కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ మోడల్ టాస్క్ ఫోర్సుకు నేత్రత్వం వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏఐను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖులు సైతం సంతకం పెట్టిన వైనం చూస్తే.. రానున్న రోజుల్లో దీని తీవ్రత ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇంకోవైపు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటిగా వ్యవహరించిస్తున్న సుందర్ పిచాయ్ సైతం కొద్ది రోజల క్రితం ఏఐతో చోటు చేసుకునే దుష్ప్రభావాలను తలుచుకుంటేనే తనకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లుగా చెప్పారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.